శివగామికి పెరిగిన డిమాండ్..ఏకంగా తమిళనాడు సిఎంగా ఛాన్స్?

శివగామి… శివగామి..శివగామి…. ఇప్పుడు అభిమానులు జపిస్తున్న పేరిది. రమ్యకృష్ణ ఇక ఇప్పటినుండి తనను తాను శివగామిగా పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బాహుబలి సినిమా తర్వాత. జక్కన్న చిత్రం విడుదలైనప్పటి నుండి శివగామి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా  ఎవరు చారిత్రక నేపథ్యం ఉన్న కథ రాసుకున్నా  అందులో ఓ పాత్రను రమ్యకృష్ణ కొరకు రాస్తున్నారట.. ఇదే కోణంలో  రెండు సినిమా కథ లు అప్పుడే స్టార్ట్ అయ్యాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయ్.

బాహుబలికి ముందు వరకు రమ్యకృష్ణ తో మామూలూ గా ఉన్న వారు కూడా బాహుబలిలో ఆమెను శివగామి గా చూసిని తర్వాత ఆమెతో మునపటిలా మాట్లాడాలంటే కాస్త జంకుతున్నారంట!  అంతటి పవర్ ఫుల్ లేడికి ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చిందంట.. ఏకంగా సిఎం అయ్యే ఛాన్స్ ఆమెను వెతుక్కుంటూ వచ్చిందంట. హోల్డన్…హోల్డన్… ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో,  అవును తమిళనాడు సిఎం జయలలిత మీద జీవిత చరిత్రకు ప్లాన్ చేస్తున్నారంట, అందులో జయ పాత్రను రమ్యకృష్ణ తో చేయించాలని డిసైడ్ అయిపోయారంట దర్శక నిర్మాతలు.

ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జయలలిత జీవితం.. హంగు ఆర్భాటాలే కాదు.. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో మలుపులు. రీసెంట్ గా కుంభకోణాల్లోనూ జయలలిత కారాగారవాసం కూడా చేశారు. ఇక ఇంతటి సినీ రాజకీయవేత్త జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించాలని..ఆ సినిమాకు రమ్యనే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయారట. ఇది ఓకే అయితే మాహిశ్మతి శివగామి తమిళనాడు సిఎం అవుతుందన్నమాట!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top