అడ్వ‌కేట్ నుండి రాష్ట‌ప‌తి వ‌ర‌కు.. రామ్ నాథ్ కోవింద్ పయ‌నం.!

భారత రాష్ట్రపతిగా కోవింద్ ఎన్నికయ్యారు. కోవింద్‌కు 65.65, మీరాకుమార్‌కు  34.34 శాతం ఓట్లు పోలయ్యాయి.రామ్‌నాథ్‌కు వచ్చిన ఓట్ల విలువ 7,02, 644 కాగా, మీరాకుమార్‌కు వచ్చిన ఓట్లు విలువ 3,67, 314. ఈనెల 25న దేశ 14వ రాష్ట్రపతిగా కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

20 ఏళ్ళ క్రితం కోవింద్ తో మోడీ….

 

 

రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన త‌ర్వాత కోవింద్ తో మోడీ.

జననం,చదువు:

రామ్‌నాథ్‌ అక్టోబర్‌ 1, 1945లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ దెహత్‌ జిల్లాలోని డేరాపూర్‌ తహశీల్‌లోని పరాంఖ్‌ గ్రామంలో జన్మించారు. కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసి… కాన్పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. తర్వాత సివిల్‌ సర్వీసెస్‌కు వెళ్లాలన్న ఆశతో ఢిల్లీ చేరుకున్నారు. మూడో ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికయ్యారు. అయితే ఐఏఎస్‌ రాకపోవడంతో… న్యాయవాదిగా స్థిరపడిపోయారు.. పేద, బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయసేవలు అందించేవారు. వివాద రహితుడిగా, పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా పేరొందిన కోవింద్‌ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 16 ఏళ్లపాటు అడ్వకేట్‌గా పనిచేశారు.

న్యాయవాది నుండి రాజకీయాల్లోకి

దేశసేవపై ఉన్న మక్కువతో తొలుత సంఘ్‌ పరివార్‌లో చేరారు రామ్‌నాథ్‌ కోవింద్‌. ఢిల్లీలో స్థిరపడిన తర్వాత డేరాపూర్‌లోని తన పాత ఇంటిని ఆర్‌ఎస్‌ఎస్‌కే రాసిచ్చారు.భాజపాలో కీలక నేతగా ఎదిగి యూపీ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. 1994 నుంచి 2006 వరకూ రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. 1998 నుంచి 2002 వరకూ భాజపా దళిత మోర్చా అధ్యక్షుడిగా రామ్‌నాథ్‌ పనిచేశారు. అఖిలభారత్‌ కోలి సమాజ్‌ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2015 ఆగస్టు 16 నుంచి ఆయన బిహార్‌ గవర్నర్‌గా కొనసాగుతున్నారు.ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యేవరకూ ఆ పదవిలో కొనసాగారు.

కుటుంబ వివరాలు

రామ్‌నాథ్ కోవింద్‌ భార్య పేరు స‌వితా కోవింద్‌. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాష్ట్రాల వారీగా పోలైన ఓట్లు…

 

 • ఉత్త‌ర ప్ర‌దేశ్: కోవింద్ -335 ఓట్లు, మీరా కుమార్- 65 ఓట్లు, 2 చెల్ల‌ని ఓట్లు
 • ఢిల్లీ: కోవింద్ – 6, మీరా కుమార్ – 55, 6 చెల్ల‌ని ఓట్లు
 • పుదుచ్చేరి: కోవింద్ – 10, మీరా కుమార్ – 19, 1 చెల్ల‌ని ఓటు
 • నాగాలాండ్: కోవింద్ – 56, మీరా కుమార్ – 1, 2 చెల్ల‌ని ఓట్లు
 • రాజ‌స్థాన్: కోవింద్ – 166, మీరా కుమార్ – 34
 • గోవా: కోవింద్ – 25, మీరా కుమార్ 11
 • మ‌హారాష్ట్ర: కోవింద్ – 208, మీరా కుమార్ – 77, 2 చెల్ల‌ని ఓట్లు
 • ఉత్త‌రాఖండ్: కోవింద్- 59, మీరా కుమార్ – 11
 • పంజాబ్: కోవింద్ – 18, మీరా కుమార్ – 95, 3 చెల్ల‌ని ఓట్లు
 • ఒడిశా: కోవింద్ 127, మీరా కుమార్ – 16, 2 చెల్ల‌ని ఓట్లు
 • గుజ‌రాత్: కోవింద్ 132, మీరా కుమార్ – 49
 • హ‌ర్యానా: కోవింద్ 73, మీరా కుమార్ 16
 • అరుణాచ‌ల్ ప్ర‌దేశ్: కోవింద్ 448, కుమార్ 24

 

Comments

comments

Share this post

scroll to top