అఘోర, నాగ‌సాధువులకు క్లాస్ పీకిన రామ్‌దేవ్ బాబా… శ్రీకృష్ణుడు, శ్రీరాముడే ముట్టలేదు-రామ్‌దేవ్ బాబా!!

ఇటీవల రామ్‌దేవ్ బాబా అర్ధ కుంభమేళా లో దర్శనమిచ్చాడు, అఘోరీ, నాగ‌సాధువులు బస చేసిన టెంట్ లకి వెళ్లి వారితో ముచ్చటించాడు, వారికి క్లాస్ కూడా పీకాడు అనుకోండి, అంటే కొన్ని విషయాలను వారికి చెప్పాడు, అఘోరీ, నాగ‌సాధువులు ఎక్కువగా గంజాయి కొడుతూ ఉంటారు, చిల్లుమ్ ( గంజాయి పీల్చడానికి వాడే గొట్టం) ఎప్పుడు చేతిలోనే ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు గంజాయి కొడుతూ ఉంటారు, గంజాయి కొట్టకపోతే వారికి రోజు గడవదు, వారితోనే గంజాయి మానిపిస్తా అని రామ్‌దేవ్ బాబా తెలిపారు, వివరాల్లోకెళితే…

 

అర్ధ కుంభ మేళ లో హల్చల్ చేసిన రామ్‌దేవ్ బాబా.. :

అఘోరీ, నాగ‌సాధువులకు క్లాస్ పీకాడు రామ్‌దేవ్ బాబా, తల్లి తండ్రి ని విడిడ్చిపెట్టి మరీ గొప్ప కార్యం కోసం సన్యాసులుగా మారుతాము మనము, అన్నిటి మీద ఆశలను వదులుకున్నాం, అలాంటిది పొగ త్రాగకుండా ఉండలేమా, పొగ త్రాగడాన్ని వదలలేమా అంటూ అఘోరీ, నాగ‌సాధువులు లను ప్రశ్నించారు ఆయన.

శ్రీకృష్ణుడు, శ్రీ రాముడే ముట్టలేదు.. :

‘భగవంతులుగా మనం పూజించే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఏ రోజు పొగ త్రాగలేదు. దేవుళ్ళకే లేని అలవాటు, మానవులం మనకెందుకు, యువత లో చాలా మంది చేత పొగ త్రాగడం మానిపించా. అఘోరీ, నాగ‌సాధువుల చేత కూడా పొగ త్రాగడం మానిపిస్తా’ అని రామ్‌దేవ్ బాబా తెలిపారు.

మ్యూజియం లో పెడతా.. :

సాధువుల వ‌ద్ద ఉండే చిల్లుమ్ ల‌ను సేక‌రించారు రామ్ దేవ్ బాబా, వాట‌న్నింటినీ కుప్ప‌గా పేర్చారు. తాను గ‌న‌క భ‌విష్య‌త్తులో మ్యూజియాన్ని పెట్టాలనుకుంటే, ఈ చిలుంల‌న్నింటినీ తీసుకెళ్లి అందులో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచుతాన‌నీ రామ్‌దేవ్ బాబా తెలిపారు.

పతంజలి గంజాయి.? :

రామ్‌దేవ్ బాబా త్వరలోనే పతంజలి పేరు మీద హానికరం కాని పతంజలి గంజాయి ని మార్కెట్ లోకి విడుదల చేస్తారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియా లో, అయితే రామ్‌దేవ్ బాబా ఏం చేసిన ఆ పదార్థాన్ని పతంజలి లో కూడా తీసుకొస్తారు అని జోరుగా ప్రచారం చేస్తారు సోషల్ మీడియా లో ట్రోలర్స్. ఇవంతా ఎప్పుడు ఉండేదే కదా అని ఆయన సపోర్టర్స్ కూడా రెస్పాండ్ అవ్వడం మానేశారు.

 

Comments

comments

Share this post

scroll to top