నేను ఆ గదిలో ఉన్నానని తెలిస్తే రాంచరణ్ పరుగులు పెడతాడు ఉపాసన!!

రాం చరణ్ తో వివాహం తర్వాత సోషల్ మీడియాలో చురుగ్గా కనిపిస్తున్న ఉపాసన తన ఫ్యామిలీ విషయాలను సరదాగా షేర్ చేస్తుంటుంది. తాజాగా వీడియో పోస్ట్ చేసిన ఉపాసన సరదా సరదా విషయాలను చెప్పుకొచ్చింది. హెల్త్ కాన్షియస్ అయిన ఉపాసన ఫుడ్ డైట్ మాత్రం నియమం తప్పకుండా పాటిస్తుంది. తాను ఈ మధ్య స్లిమ్ గా మారడానికి కారణం కూడా అదే అని చెప్తోంది. రామ్ చరణ్ కూడా ఈ డైట్ ఫాలో అవ్వడం వల్లేమో ఈ మధ్య హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ ఫుడ్ విషయంలో కూడా ఉపాసన చాలా జాగ్రత్తలు తీసకొంటుందిి.


ఇక విషయానికొస్తే… సోషల్ మీడియాలో సరదా విషయాలు పంచుకున్న ఉపాసన… తనకు సరిగ్గా వంట రాదని పేర్కొంది. ఆ విషయం మెగా ఫ్యామిలీ అందరికి తెలుసని… ముఖ్యంగా తన భర్త రామ్ చరణ్ కి తన వంట అంటే భయం అంటోంది. “ఎప్పుడైనా నేను వంట గది లోకి వెళ్తే చరణ్ వెంటనే ఇంట్లోంచి బయటకు పరుగులు పెడతాడు. నేను ఏదైనా వంట చేసి తన మీద ప్రయోగిస్తానేమోనని భయం” అని చెప్పుకొచ్చింది.
రామ్ చరణ్ ఏ విషయాన్నైనా చాలా క్యాజువల్ గా తీసుకుంటాడని… దేన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకోడని తెలిపింది. ఇక పిల్లల గురించి ప్రస్తావన ఇప్పుడు కాదని… అది తమ వ్యక్తిగత విషయమని చెప్పింది.

Comments

comments

Share this post

scroll to top