రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన “రంగస్థలం” హిట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Movie Title (చిత్రం): రంగస్థలం (rangasthalam)

Cast & Crew:

నటీనటులు: రామ్ చరణ్,సమంత,ఆది,జగపతిబాబు,ప్రకాష్ రాజ్,అనసూయ తదితరులు
దర్శకత్వం: సుకుమార్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: మైత్రి మూవీ మేకర్స్

Story:

పల్లెటూరి రాజకీయ నేపథ్యంలో బలమైన కథతో ఈ చిత్రం సాగనుంది. ఆది ఈ సినిమాలో మరో మఖ్యపాత్రలో నటిస్తున్నారు. ‘రంగస్థలం’ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఆ ఊరి ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రతినాయకుడు జగపతిబాబుపై పోటీకి దిగటం, తనకు ప్రత్యర్థిగా ఉన్న ఆదిని అంతమొందించడం, ఆ తరువాత ఆది తమ్ముడు చిట్టిబాబు ఎలాంటి సాహసానికి పూనుకున్నాడు.. రామలక్ష్మి కథలో ఏవిధంగా కీలకం అయ్యింది? రంగమ్మత్త (అనసూయ) పాత్ర ఏంటి? ప్రకాష్ రాజ్ పాత్ర ఎలా ఉంది? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Review:

మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రంలో చెవిటి పాత్రలో పెద్ద ప్రయోగమే చేస్తుండటం మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక రామలక్ష్మిగా సమంత నటన, దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, ప్రతినాయకుడిగా సీనియర్ హీరో జగపతిబాబు హావభావాలు ఈ సినిమాపై విపరీతమైన హైప్‌ను తీసుకువచ్చాయి. ఇక ఈమూవీలో రంగమ్మత్తగా యాంకర్ అనసూయ నటిస్తుండటం మరో విశేషం అయితే… డీజే బ్యూటీ పూజా హెగ్డే జిగేల్ రాణీ అంటూ ఐటమ్ సాంగ్ అందాలను ఊరిస్తుండంటం ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి రప్పించేలా చేస్తున్నాయి.

Plus Points:

రామ్ చరణ్, సమంత యాక్టింగ్
సుకుమార్ స్టోరీ, డైరెక్షన్
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్
జగపతి బాబు రోల్
ఆది పినిశెట్టి
అనసూయ, పూజ హెగ్డే

Final Verdict:

రామ్ చరణ్, సమంత, జగపతిబాబు పెర్ఫామెన్స్‌తో చితక్కొట్టారన్నారు. సుకుమార్ అద్భుతమైన కథ సమ్మర్ కాసులు కురిపించే పైసా వసూల్ కమర్షియల్ హిట్ “రంగస్థలం”

AP2TG Rating:  3.75 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top