హీరోయిన్ రకుల్ ప్రీత్ రిలీజ్ చేసిన…”రామాయణంలో తుపాకుల వేట” షార్ట్ ఫిల్మ్.

Siva Ram

రామాయణంలో తుపాకుల వేట అనే షార్ట్ ఫిల్మ్ ను ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫేస్ బుక్, ట్విట్టర్ వేధికగా విడుదల చేశారు. షార్ట్ ఫిల్మ్ టీమ్ కు  శుభాకాంక్షలు  తెలిపారు. గతంలో హాప్ గర్ల్ ఫ్రెండ్, హ్యాపీ ఎండింగ్ లాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్ జయశంకర్….తాజాగా తీసిన షార్టీయే రామాయణంలో తుపాకుల వేట…. ప్రస్తుతం లవ్ ట్రెండ్ ను యువత మైండ్ సెట్ ను మిక్స్ చేసి….లోకం నడుస్తున్న తీరును నాలుగు పాత్రలతో చూపించాడు… ఈ డైరెక్టర్.

ప్రేమించిన అమ్మాయిని వదిలించుకోవడం కోసం….ఒక ఫ్రెండ్ మరొక ఫ్రెండ్ కు హెల్ప్ చేసిన విధానమే ఈ షార్ట్ ఫిల్మ్…కానీ ఈ సన్నివేశంలో పేలిన ఒక్కో డైలాగ్ …టోటల్ సొసైటీని, లవ్ ను టైమ్ పాస్ గేమ్ లా మార్చిన యువతను టార్గెట్ చేస్తూ దూసుకెళ్లినవే.! టోటల్ లవ్ స్టోరినే బ్రేకప్ చేసేంత పవర్ ఫుల్ డైలాగ్ ను, సన్నివేశాన్ని క్రియేట్ చేసి….ప్రజెంట్ చేసిన విధానం చాలా మెట్యూర్డ్ గా ఉంది. ఇషాంత్ క్యారెక్టర్ చేత పలికించిన సంభాషణలు చాలా న్యాచురల్ గా ఉన్నాయి, అతని వాయిస్…ఆ డైలాగ్స్ కు ఫర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనిపించింది. ఇక టేకింగ్, BGM కూడా ఈ లఘుచిత్రాన్ని మరో రేంజ్ కు తీసుకెళ్లాయి.

పేలిన డైలాగ్స్:

  • ఎవరితో ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందో వాళ్లతో కాదు బ్రతకాల్సింది. మనం లేకుండా ఎవరైతే బ్రతకలేరో…వాళ్లతో ఉండాలి, అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది.
  • అబ్బాయిలు అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, లైఫ్ బాగుంటుంది, అదే అమ్మాయిలు మాత్రం లైఫ్ లాంగ్ ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  • మనం ప్రేమించే వాళ్లలో ప్లస్ లు ఇష్టపడాలి, మైనస్ లు భరించాలి.
  • రిలేషన్ షిప్ లో అబద్దాలుండొచ్చు కానీ, సీక్రెట్స్ ఉండకూడదు, అలా సీక్రెట్స్ ఉన్నాయంటే మోసం చేస్తున్నారని అర్థం.

Rating:    4/5

Watch Ramayanam Lo Tupaakula Veta Short Film:

14958087_900937656708789_1294323757_o

Comments

comments