దుర్గా దేవి అనుగ్ర‌హం కోసం రాముడు త‌న కంటిని అర్పించాడ‌ని మీకు తెలుసా..?

దేవీ న‌వ‌రాత్రులు దేశవ్యాప్తంగా ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. దుర్గా దేవి ఇప్ప‌టికే అనేక రూపాల్లో గ‌త కొద్ది రోజులుగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నమిస్తోంది. ఈ క్ర‌మంలో ఎక్క‌డ చూసినా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో అత్యంత వైభ‌వం కూడా క‌నిపిస్తోంది. అయితే విజ‌య‌ద‌శ‌మి ముందు 9 రోజుల పాటు దుర్గాదేవిని పూజించ‌డం ఇప్పుడు కాదు పురాణాల కాలం నుంచే వ‌స్తోంది. ఆ 9 రోజుల పాటు అమ్మ‌వారిని పూజిస్తే ఎంతో పుణ్యం ల‌భిస్తుంద‌ని, అష్టైశ్వ‌రాలు క‌లుగుతాయ‌ని, అనుకున్న ప‌నుల‌న్నీ నెర‌వేరుతాయ‌ని చాలా మంది భక్తులు న‌మ్ముతారు. ఈ క్ర‌మంలో రామాయ‌ణంలో రాముడితోపాటు, మ‌హాభార‌తంలో పాండ‌వులు కూడా దుర్గాదేవిని పూజించి యుద్ధాల్లో విజ‌యాలు సాధించిన‌ట్టు పురాణాల చెబుతున్నాయి. అయితే మీకు తెలుసా..? రాముడు దుర్గాదేవిని పూజించే స‌మ‌యంలో త‌న కంటిని దేవికి అర్పించాడ‌ని..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఆ ఘ‌ట‌న వెనుక ఉన్న అస‌లు క‌థ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

rama-durga-pooja

సీత‌మ్మ‌ను రావ‌ణుడు లంకకు అప‌హ‌రించుకుపోయాడ‌ని అంద‌రికీ తెలిసిందే క‌దా. ఈ క్ర‌మంలో రాముడు వాన‌ర సైన్యంతో క‌లిసి రావ‌ణుడి పైకి దండెత్తి వెళ్తాడు. యుద్ధం మ‌రో రోజుల జ‌రుగుతుంద‌న‌గా రాముడు విజ‌యం కోసం దుర్గాదేవిని పూజిస్తాడు. అయితే 100 తామ‌ర‌పూల‌తో దేవిని అర్చిస్తే అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ని పండితులు చెప్ప‌డంతో రాముడు అలాగే చేస్తాడు. కానీ ఎటు చూసినా, ఎక్క‌డ వెతికినా అత‌నికి 99 తామ‌ర పూలు మాత్ర‌మే ల‌భిస్తాయి. దీంతో క‌మ‌ల న‌య‌నుడిగా పిల‌వ‌బ‌డే రాముడు క‌మ‌లాల లాంటి త‌న క‌న్నుల్లో ఓ కన్నును దేవికి అర్పిస్తాడు. రాముడు పూజ‌కు మెచ్చిన దుర్గా దేవి ప్ర‌త్య‌క్ష‌మై అత‌నికి వ‌రాలిస్తుంది. దీంతో రాముడు రావ‌ణుడిపై యుద్ధంలో విజ‌యం సాధిస్తాడు.

అయితే కేవ‌లం రాముడే కాదు, పాండ‌వులు కూడా దుర్గాదేవిని పూజించేవారు. వారు విరాట రాజు కొలువులో అజ్ఞాత వాసం ముగిశాక శ‌మీ (జ‌మ్మి) చెట్టు వ‌ద్ద‌కు చేరుకుని త‌మ అస‌లు రూపాల‌ను పొందుతారు. ఆ వృక్షం కొమ్మ‌ల‌పై అంత‌కు ముందు వారు ఉంచిన త‌మ ఆయుధాల‌ను కూడా తిరిగి తీసుకుని యుద్ధంలో విజ‌యం సాధిస్తారు. ఇది జ‌రిగింది కూడా విజ‌య‌ద‌శ‌మి రోజునే. అందుకే ఆ రోజున అంద‌రూ జ‌మ్మిని కూడా పంచుకుంటారు. పిన్న‌లు పెద్ద‌ల దీవెనలు అందుకుంటారు. ఒకే ఈడు వారైతే అల‌య్ బ‌ల‌య్ చేసుకుంటారు.

Comments

comments

Share this post

scroll to top