విడాకులకు సిద్ధమైన రమారాజమౌళి, భార్యభర్తలిద్దరినీ కలిపిన కాఫీ కప్పు!

అన్యోన్యమైన దాంపత్య జంట… విడాకులకు సిద్దమౌతుంది.  చిన్న చిన్న కారణాలనే బూతద్దంలో పెట్టి చూస్తూ  తప్పు నీదంటే నీదంటూ ఒకర్నొకరు నిందించుకుంటుంటారు ఆ భార్యాభర్తలు. ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో క్లారిటీ లేదు, కానీ విడాకులు మాత్రం కావాలని డిసైడ్ అవుతారు. కానీ ఓకే ఒక్క కాఫీ కప్పు వారి అభిప్రాయలను చేంజ్ చేస్తుంది. ఇదీ స్థూలంగా రమారాజమౌళీ షార్ట్ ఫిల్మ్ స్టోరీ… వాస్తవానికి ఇది షార్ట్ ఫిల్మ్ అయినప్పటికీ..ప్రస్తుత భార్యాభర్తల మనస్తత్వాన్ని, అనుమానపు పెనుభూతాన్ని…ఆలు మగల మద్య ఏర్పడుతున్న కమ్యూనికేషన్ గ్యాప్ ను పర్పెక్ట్ గా కళ్ళకు కట్టింది.

సిగరెట్ తాగడం మానేస్తే మరో 50 ఏళ్ళు హ్యాపీగా  బ్రతకొచ్చని ఆయనతో ఆమె, 30 ఏళ్ళకే ముసలిదానివి కాకూడదనుకుంటే ముందు ఐస్ క్రీమ్ తినడం మానేయంటూ ఆమెతో అతను” ఇంతటి ప్రేమున్న భార్యాభర్తల విడాకులకు చిన్న చిన్న కారణాలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇంతకీ వారి మధ్య వచ్చిన గొడవలేంటీ? ఎందుకు విడిపోవాలనుకున్నారు? ఇందులో వారిని కలిపిన ఆ ట్విస్ట్ ఏంటి? అనేది చాలా చక్కగా చూపించాడు దర్శకుడు.

విడాకుల కోసం కొట్టుకుంటున్న భార్యాభర్తలను కలపడానికి ఒక కప్ కాఫీ చాలంటూ కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు మలిచిన విధానం చాలా చక్కగా ఉంది. ఆకట్టుకునే డైలాగ్స్, చక్కటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, తక్కువ టైంలో పెద్ద సమస్యను డీల్ చేసిన విధానం బాగున్నాయి.

Watch Rama Rajamouli ShortFilm:

Comments

comments

Share this post

scroll to top