చెన్నై వరద బాధితులను ఆదుకోడానికి ఫేస్ బుక్ ను ఎంచుకున్న కుర్రాడు..మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించాడు.

తమిళనాడులో కురుస్తున్న ఎడతెరపని వర్షాలకు తమిళనాడు ప్రజలు ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంటున్నారో మనం చూస్తున్నాం. క్షణమొక యుగంలా తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని సాయం కోసం అర్థిస్తున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమా తారలు ధన సహాయం, ఫుడ్ ప్యాకెట్స్ సప్ప్లై చేస్తున్నారు. అయితే బెంగుళూర్ కు చెందిన రామ్ కశ్యప్ అనే ఓ యువకుడు తమిళనాడు ప్రజలను ఆదుకునేందుకు తన స్నేహితులతో కలిసి 14 గ్రూపులుగా డివైడ్ అయి తమిళ ప్రజలకు సహయం చేస్తున్నారు. వారికి అవసరమైన ఫుడ్, పేపర్ ప్లేట్స్,కప్స్ రెయిన్ కోట్స్, గొడుగులు అందించారు. చెన్నై ప్రజలకు సహాయం చేసేందుకు బయలుదేరుతున్నామని,ఎవరైనా సహాయం చేయాలనుకునేవారు సహాయం చేయవచ్చని తన ఫేసు బుక్ అకౌంట్ ద్వారా తెలిపాడు.

CR-3

మరో మూడు గంటల్లో బెంగళూర్ నుండి మొదటి ట్రిప్ గా ప్యాక్ చేసుకొని చెన్నై బయలుదేరుతున్నామని, ఇప్పుడు ఏవీ తీసుకురావద్దని, చెన్నై నుండి వచ్చిన తర్వాత మీ దగ్గర నుండి సెకండ్ ట్రిప్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామని చెప్పాడు. ఇప్పటివరకూ 1200 మంది అతన్ని కాంటాక్ట్ అయినట్లు, 250 మంది వాలంటీర్స్ తమ గ్రూప్ లో పనిచేస్తున్నట్లు ఐబిఎన్ ఇంటర్వ్యూ కు తెలిపాడు. ఇంకా తమ గ్రూప్  మెంబర్స్ బెంగళూర్ లో ఇక్కడి ప్రజలకు కావాల్సిన అవసరాలను అందించేందుకు కృషి చేస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top