రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సికి ఫేమస్. ఆయన ట్విట్టర్ లో ఏం పెట్టిన అది సెన్సేషన్ అవుతుంది. తిట్టే వారు కొంతమంది అయితే పొగిడే వారు కొంతమంది. కానీ ఈ సారి ఆయన ఏమన్నాడో చూస్తే అందరికి కోపం వస్తుంది. హద్దు మీరి ప్రవర్తించాడు. ప్రతి భారత స్త్రీని అవమానించాడు. ఉమెన్స్ డే రోజు గౌరవించాల్సిందిపోయి చాలా చీప్ గా మాట్లాడాడు.
వాట్సాప్ , ఫేస్బుక్ లో అందరూ “హ్యాపీ ఉమెన్స్ డేష అనే మెసేజ్లు పంపించుకుంటుంటే….., ఈ రామ్ గోపాల్ వర్మ మాత్రం అమ్మాయిలని ఆటవస్తువులు, మగవాళ్లను సుఖపెట్టడానికే ఆడవాళ్ళూ అంటూ…….. పోర్న్ స్టార్ “సన్నీ లియోన్” లాగా ప్రపంచంలో ఉన్న ఆడవారు అందరూ మగవారిని సుఖపెట్టాలి అంటూ ట్వీట్ చేశాడు.. సన్ని లియోన్ ఎంత సంతోషం అయితే ఇస్తుందో అంత సంతోషాన్ని ప్రపంచంలోని ఆడవారందరూ మగవారికి అందివ్వాలట!
I wish all the women in the world give men as much happiness as Sunny Leone gives
— Ram Gopal Varma (@RGVzoomin) March 8, 2017
చూస్తేనే రక్తం మరిగిపోతుంది కదా!. అక్కడితో ఆగాడా? మరింత శృతిమించాడు!
సంవత్సరం మొత్తంలో ఆడవారి రోజులన్నీ మొగవారికే అంట. ఒక్కరోజు మాత్రమే ఆడవాళ్లకు అంట.
https://twitter.com/RGVzoomin/status/839290648217804800?ref_src=twsrc%5Etfw
మగవారే ఆడవారిని ఎక్కువ సెలెబ్రేట్ చేసుకుంటారంట. ఎంత డబల్ మీనింగ్ ఉందొ చూడండి!
Women's day should be called #MensDay because men celebrate women much more than women celebrate women
— Ram Gopal Varma (@RGVzoomin) March 8, 2017
సోషల్ మీడియా లో నెటిజన్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చర్య స్త్రీ ని అవమానించడమే అంటున్నారు!