ట్విట్టర్ స్టార్ మళ్లీ..ట్విట్టర్ వేదికపై తన దైన స్టైల్లో ట్వీట్స్ విసిరారు. ఆయన ట్వీట్ల సారాంశాన్ని లోతుగా పరిశీలిస్తే బాహుబలి సినిమా మీద పంచులు గట్టిగానే విసిరాడనిపిస్తుంది. సినిమా ఇంపాక్ట్ వందల కోట్లు, వందల రోజుల షూటింగ్ తోనే కాకుండా, సింపుల్ స్టోరీ, మహేష్ బాబు క్లోజప్ షాట్స్ తో కూడా వస్తుందని శ్రీమంతుడు సినిమా ప్రూవ్ చేసిందని అన్నారు రామ్ గోపాల్ వర్మ.
అయితే వందల కోట్లు, వందల రోజులు అనే లైన్ మాత్రం బాహుబలిని ఉద్దేశించిందేనని అంటున్నారు సినీ విశ్లేషకులు. కుండబద్దలు కొట్టినట్లు.. ట్వీట్స్ చేసే అలవాటున్న వర్మ , ఈ సారి కూడా అదే పని చేశాడు. వాస్తవానికి ఇప్పుడు ఈ టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది బయట. ఎలాంటి హంగామా లేకుండానే బ్లాక్ బాస్టర్ మూవీని తీయవచ్చు అని శ్రీమంతుడు ప్రూవ్ చేసిందని ప్యాన్స్ అంటున్నారు , సింపుల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్రిన్స్ శ్రీమంతుడు ఆకట్టుకుంది. మొదటి రోజు కలెక్షన్ల విషయంలో బాహుబలితో పోటీ పడుతుంది.
CLICK: శ్రీమంతుడికి వెళితే ఈ 5 సీన్లు మిస్ అవ్వొద్దు.