అర్థరాత్రి రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్… రావణాసురుడు మంచోడంటూ కితాబు.

ఊరందిరి ఓ దారి ఉలిపికట్టెది ఓ దారి అన్నట్టు ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ పెద్ద చర్చకు దారితీస్తారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ…నిన్న కూడా అదే చేశారు మన ట్విట్టర్ స్టార్.. తన ట్వీట్లతో ఏకంగా పోల్ కూడా పెట్టేశారు ఈ రక్తచరిత్ర డైరెక్టర్ గారు.ఇప్పుడు సార్ చేసిన ట్వీట్స్ యాస్ ఇట్ ఈస్ మీకోసం. రావణాసురుడు సీతను అపహరించి తన ఆధీనంలో నెలల తరబడి ఉంచాడు. కానీ ఏదైనా అఘాయిత్యానికి ఒడిగట్టాడా? … ఆహా ఏదో అడుగుతున్నా. రావణుడు విలన్ అని తెలుసు.. కానీ హిట్లర్, ఒసామా బిన్ లాడెన్లలా.. కరుడు గట్టిన విలన్లా ప్రవర్తించినట్టు ఎప్పుడూ వినలేదు. ఒక విలన్లా రావణాసురుడు ఎప్పుడూ చేయలేదు… అయినా నిజంగా అతనొక పెద్ద విలనా? (దీనిపై పోల్ క్వశ్చన్ కూడా పెట్టారు)

నేను చదివిన వాటిలో రాక్షసులు ఎవరూ రాక్షసులు చేసే పనులు చేయలేదు. మరోలా చెప్పాలంటే రచయితలు ఎవరూ క్యారెక్టర్లని సరిగా డెవలప్ చేయలేదు కానీ మనం వాటిని గుడ్డిగా నమ్ముతున్నాం.. సీతను అపహరించడమే రావణాసురుడి తప్పయితే.. భారత్లో ప్రతి నెలా 100 మందికి పైగా రావణాసురుడి కన్నా పెద్ద విలన్లను మనం అందించొచ్చని అనుకుంటున్నాను”

ఇలా ట్వీట్ చేసి మరో మారు వార్తల్లో నిలిచాడు వర్మ.

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top