ఆ ఇద్దరి పై గురి పెట్టిన రాంగోపాల్ వర్మ ఎందుకో తెలుసా!!

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో నారా నందమూరి వాళ్ళని ఆడుకోటానికి వర్మ సిద్ధమయ్యాడా.? ఇన్ని రోజులుగా లేనిది ఎన్నికల ముందే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తో ముందుకు రావడం పైన అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లో అన్ని నిజాలే చూపిస్తా అని వర్మ పదే పదే అంటున్నాడు, ప్రచారం కూడా అదే రేంజ్ లో చేస్తున్నాడు వర్మ.

పోస్టర్లతో పిచ్చెక్కిస్తా.. :

వర్మ పబ్లిసిటీ స్టైల్ ఏ డిఫరెంట్. రామ్ గోపాల్ వర్మ ఇటీవల తీసిన సినిమాల్లో మేటర్ తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అని జనాలే చెబుతున్నారు, అయినా కూడా వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మీద హైప్ రావడానికి కారణం వర్మ డిఫరెంట్ స్టైల్ అఫ్ పబ్లిసిటీ నే. వర్మ వదులుతున్న పోస్టర్స్ కానీ, స్టిల్స్ కానీ, జనాలను ఆకట్టుకునేలా ఉన్నాయ్.

ఎన్టీఆర్ గారు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో ఎత్తుకు ఎదిగారు, రాజకీయాల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు ఎన్టీఆర్, కానీ ఆయన చివరి రోజుల్లో రాజకీయాల వల్లే ఇబ్బంది పడాల్సి వచ్చింది. సొంత పార్టీ వాళ్లే ఆయనను దూరం పెట్టారు, ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించారు, ఎన్టీఆర్ గారి జీవితం లో లక్ష్మి పార్వతి గారి ఎంట్రీ తరువాత జరిగిన సంఘటనలను ఉన్నవి ఉన్నట్టుగా చూపిస్తా అని రామ్ గోపాల్ వర్మ తెలిపాడు.

కుటుంబ చిత్రం కాదు, కుట్రల చిత్రం.. :

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కుటుంబ చిత్రం కాదు, కుట్రల చిత్రం అని ఒక పోస్టర్ విడుదల చేసాడు వర్మ, సినిమా అంత కుట్రలతో నిండిపోయి ఉంటుందని వర్మ ఇండైరెక్ట్ గా చెబుతున్నాడు. పాటల్లో కూడా ఇండైరెక్ట్ గా కొందరిని టార్గెట్ చేసాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని వెన్నుపోటు లిరికల్ సాంగ్ లో చంద్ర బాబు గారు, ఎన్టీఆర్ గారు కలిసున్న పిక్స్ నుండి విసరాయ్ హోటల్ బోర్డు పిక్ వరకు ఈ లిరికల్ సాంగ్ లో పెట్టాడు వర్మ, అసలు ఈ పాటలోని లిరిక్స్ కి అయితే ఒక దండం పెట్టొచ్చు, ఇంత పచ్చిగా ఇండైరెక్ట్ గా రామ్ గోపాల్ వర్మ చూపెడుతాడని ఎవ్వరు అనుకోలేదు.

నారా లోకేష్ మొర్ఫెడ్ పిక్స్.. :

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ని ఎవరైనా అడ్డుకుంటే ఖబడ్దార్ అని రామ్ గోపాల్ వర్మ అంటున్నాడు, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ కూడా కొన్ని ట్వీట్స్ వేసాడు వర్మ. లోకేష్ మొర్ఫెడ్ పిక్ కూడా పెట్టాడు.

 

Comments

comments

Share this post

scroll to top