డ్రగ్స్ కేసులో వర్మ మాటలకు అందరు ఫైర్ అయ్యారు..! పర్ఫెక్ట్ కౌంటర్ ఎలా ఇచ్చారో చూడండి! [VIDEO]

డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల విచారణ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులనే టార్గెట్ చేయడం…సినిమా వాళ్లపై కుట్ర జరుగుతోందా అన్న అనుమానం వ్యక్తం అవుతున్నదని వర్మ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. తొలుత ఘాటుగా విమర్శలు గుప్పిస్తూ పోస్టులు చేసిన వర్మ ఆ తరువాత కొంత తగ్గి అకున్ సబర్వాల్ చిత్తశుద్ధిపై తనకు నమ్మకం ఉందన్నారు. ఆ వెంటనే మళ్లీ స్వరం మార్చి…సబర్వాల్ లో మానవత్వం మేల్కోవాలని పేర్కొన్నారు. విచారణ జరుపుతున్న సిట్ కుటుంబ సభ్యులను కూడా ఇలాగే ప్రజల ముందు నిలబెడితే వారెలా ఫీలవుతారని ప్రశ్నించారే. విచారణ విషయాలను కొందరు ఉద్దేశపూర్వకంగా లీక్ చేస్తూ సినిమా వ్యక్తుల పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు విషయాలను అకున్ సబర్వాల్ నేరుగా ఎందుకు వెళ్లడించడం లేదని ప్రశ్నించారు.

watch video here:

సిట్ అధికారులు పూరి జగన్నాథ్, సుబ్బరాజు మిగిలిన సినీ ప్రముఖులు విచారించినట్టుగానే స్కూల్ విద్యార్థులను కూడా విచారిస్తారా..? ప్రస్తుతం మీడియా అకున్ సబర్వాల్ ను అమరేంద్ర బాహుబలి లా చూపిస్తుంది.

I am very much wondering if the school children taking drugs also will be summoned by SIT and interrogated for 12 hours…

Posted by RGV on Friday, 21 July 2017

రాజమౌళి ఆయనతో బాహుబలి 3 తీయాలేమో. అకున్ సబర్వాల్ గారి సమగ్రతను ఎవరు అనుమానించటం లేదు. కానీ ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేకుండా మీడియాకు లీకులివ్వటం, ప్రముఖులకు కీర్తికి భంగం కలిగించే విధంగా, వారి కుటుంబాలకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించటం దురదృష్టకరం.’ అంటూ తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు.

Nobody is denying the integrity of Mr.Sabarwal or his department but even without any charges or conclusive proof to…

Posted by RGV on Friday, 21 July 2017

ఈ కామెంట్స్ తో పాటు ప్రముఖ రచయిత సిరాశ్రీ సినిమాలపై రాసిన ఓ కవితను తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు. సామాన్యుడి ప్రతీ పనిలో సినిమా వాళ్లు కావాలి, అలాగే వాళ్లు విమర్శించడానికి వాళ్లు వేసే నిందలు బరించడానికి కూడా సినిమావాళ్లే కావాలంటూ సిరాశ్రీ రెండు రోజుల క్రితం తన ఫేస్ బుక్ లో ఓ కవితను పోస్ట్ చేశాడు. ఇప్పుడు అదే కవితను వర్మ మళ్లీ పోస్ట్ చేశాడు.

మనకి సినిమావాళ్లు కావాలి:ఫేసుబుక్కులో నాలుగు లైకులు కొట్టించుకోవడానికిసినిమావాళ్లతో ఫోటో కావాలి;కొత్తగా షాప్…

Posted by RGV on Friday, 21 July 2017

మనకి సినిమావాళ్లు కావాలి:

ఫేసుబుక్కులో
నాలుగు లైకులు కొట్టించుకోవడానికి
సినిమావాళ్లతో ఫోటో కావాలి;

కొత్తగా షాప్ పెట్టుకుంటే
దాని ఓపెనింగ్ కి
సిమిమావాళ్లు కావాలి;

ఇంట్లో పెళ్లి గురించి
నలుగురూ చెప్పుకోవాలంటే
సినిమావాళ్లు రావాలి;

స్కూలు, కాలేజీ ఫంక్షన్లకి
ఊపు రావాలంటే
సినిమావాళ్లు కావాలి;

కానీ సమాజం భ్రష్టు పడుతోంది
అని అనిపించినప్పుడల్లా
మన ఛీత్కారాలన్నీ
సినిమావాళ్లకే పోవాలి.

వాళ్ల ఆవేదన
వాళ్ల ఆక్రందన
వాళ్ల విషాదం
వాళ్ల భయం
వాళ్ల కష్టం
వాళ్ల నష్టం
వాళ్ల బాధ-

ఏదైనా సరే
మనకి వినోదమే!
అవును
మనలో ఉన్న ఆ శాడిజానికి
మనమే దండేసుకోవాలి!

అందుకే-
మన యూట్యూబ్ హిట్స్ కి
సినిమావాళ్లు కావాలి;
మన చానల్ టీ.ఆర్.పీ లకి
సినిమావాళ్ళు కావాలి-
నవ్వుతూ అయినా,
ఏడుస్తూ అయినా,
సజీవంగా అయినా,
జీవచ్ఛవంగా అయినా,
శవంగా అయినా-
ఎలాగైనా పర్లేదు
మనకి సినిమావాళ్లు కావాలి.

సినిమావాళ్లంటే
పబ్లిక్ గార్డెన్లో పువ్వులు-
ముచ్చటేస్తే పొగిడేస్తాం
అవకాశమొస్తే కోసేస్తాం
ఏమీ తోచకపోతే నలిపేస్తాం…
ఇలా
ఏదో ఒకటి చెయ్యడానికి
మనకి సినిమావాళ్లు కావాలి.

– సిరాశ్రీ

Comments

comments

Share this post

scroll to top