నగ్నచిత్రం కాదు నగ్నసత్యం..! వర్మ “జీఎస్టీ” స్టోరీ ఏంటి..? రివ్యూ తెలుగులో..!

Krishna

Movie Title (చిత్రం): గాడ్ సెక్స్ & ట్రూత్ (GST)

Cast & Crew:

  • నటీనటులు: మియా మాల్కోవా
  • సంగీతం: ఎం.ఎం. కీరవాణి
  • నిర్మాత:  రాంగోపాల్ వర్మ
  • దర్శకత్వం: రాంగోపాల్ వర్మ

Story:

సాక్ష్యాత్తు ఆ దేవతల గ్యాంగ్ లీడర్ అయిన ఇంద్రుడే పరాయి ఆడదాని యద సంపద చూసి క్షణకాలం తాను దేవతల రాజుని అని మరచి ఆమెను పొందడం కోసం దివి నుంచి భూమికి దిగివచ్చాడట. ఇక మానవమాత్రులం మనమెంత. శృంగారం అనేది నేచురల్ డిజైర్. ఏ పురుషుడికి/స్త్రీకి అయినా వేరే ఏ స్త్రీ/పురుషుడి మీద అయిన కమవాంఛ కలుగుతుంది. అంతమాత్రానా వారు అధములు అని కాదు.

మనం చిన్నపిల్లల్ని కాళ్ళ మీద, వీపు మీద ముద్దాడుతాం, ఆఖరికి వారి కాళ్ళకి మట్టి అంటినా దాన్ని మన చేతులతోనే తుడిచి మరీ ముద్దు చేస్తాం. ఎందుకంటే వారి మీద విపరీతమైన మమకారం ఆ కాలికి అంటిన మట్టి మీదకంటే ఆ బుడతడి పసిదనపు ఛాయాల మీదే మన దృష్టి కేంద్రీకృతమయ్యేలా చేస్తుంది. అలాగే.. శృంగారంలో పాల్గొనే యువతీయువకులు ఒకర్నొకరు ముద్దాడుతారు, తమ భాగస్వామి రహస్య కేంద్రాలను తాకుతారు. అదంతా శృంగారంలో ఒక భాగమే కానీ జుగుప్సాకరమైన విషయం అయితే కాదు.

అలాగే స్త్రీ శరీరభాగాల్లో యద సంపద, యోని అనేవి కాలకృత్యాలు తీర్చుకోవడంలో కంటే రతి సమయంలో ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. అందుకే స్త్రీ శరీరాన్ని ఆరాధించండి. భవిష్యత్ కాలంలో కులం, మతం, రాజకీయం, వ్యాపారం కంటే ఎక్కువగా మానవాళిని శాసించేది శృంగారం మాత్రమే. ఎంతటి మహాఘనుడైనా, మహానుభావుడైనే శృంగార సమయంలో ఆడదాని ముందు మోకరిల్లల్సిందే.

Review:

అసలు దేవుడు సెక్స్ అనేది ఎందుకు సృష్టించాడు అనే విషయాన్ని తనదైన శైలిలో చెప్పాడు వర్మ. క్యుమెంటరీ రూపంలో ఒక అందమైన మహిళ చేత నిండైన ఆరు గజాల చీర కట్టి కామెరా ముందు కూడా కూర్చోబెట్టి చెప్పించవచ్చు. కానీ.. ఆ విధంగా చీర కట్టుకొని చెబితే ఎవరు వింటారు చెప్పండి. అందుకే ఒక పాపులర్ పోర్న్ స్టార్ ను తన మాధ్యమంగా ఎంచుకొన్నాడు. ఆమె నగ్నదేహం ఆధారం చేసుకొని అందరూ మాట్లాడుకోవడానికి ఇబ్బందిపడే విషయాల్ని చర్చించాడు. ఇదేమీ భారీ స్థాయిలో తెరకెక్కే సినిమా కాదు, అందుకే కెమెరా బాధ్యతలు కూడా ఆర్జీవి స్వీకరించి తానే తెరకెక్కించాడు.

Plus Points:

కొత్త కాన్సెప్ట్
కీరవాణి మ్యూజిక్
వర్మ సినిమాటోగ్రఫీ

Final Verdict:

నగ్నంగా చూపించారు…కానీ అసభ్యంగా చూపించలేదు..!

AP2TG Rating: 2.75 / 5

Trailer:

Comments

comments