వెరైటి వర్మ ప్రతి సరి తన దిన శైలి లో విర్చుకుపడే వర్మ ! ఈ సరి పవన్ ఫాన్స్ ఎలా కౌంటర్ ఎటాక్ ఎసాడో తెలుసా

Siva Ram

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఆయన సినిమా తీస్తే అది వివాదాస్ప‌ద‌మ‌వుతుంది. చివ‌ర‌కు ఆయన మాట్లాడినా, ఏం చేసినా వివాదాస్ప‌దంగానే ఆయ‌న చ‌ర్య‌లుంటాయి. ఈ మ‌ధ్య కాలంలో శ్రీ‌రెడ్డి చుట్టూ అలుముకున్న వివాదంలో రామ్ గోపాల్ వ‌ర్మ పేరు ఏ విధంగా మారుమోగిపోయిందో అంద‌రికీ తెలిసిందే. శ్రీ‌రెడ్డి చేత తానే ప‌వ‌న్‌ను తిట్టించాన‌ని అనేక సార్లు వ‌ర్మ చెప్పారు. అయినా ఫ్యాన్స్ మాత్రం వ‌ర్మ‌ను చంపేస్తాం, న‌రికేస్తాం.. అని బెదిరించారు. అయితే ఇలాంటి బెదిరంపు ఘ‌ట‌న‌లు, త‌న‌ను భయ‌పెట్టిన సంఘ‌ట‌న‌లు, వ్య‌క్తుల గురించి వ‌ర్మ తాజాగా మాట్లాడారు. ఆయ‌న ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ వివ‌రాల‌ను వెల్లడించారు.

త‌న జీవితంలో భ‌యం అంటే ఏంటో తెలియ‌ద‌ని రామ్ గోపాల్ వర్మ ఆ ఇంట‌ర్వ్యూలో అన్నారు. అస‌లు త‌న‌ను భ‌య పెట్టిన వ్యక్తులు లేదా సంఘ‌ట‌న‌లు ఏవీ లేవ‌ని తెలిపారు. అయితే వాటికి కార‌ణాలు కూడా అనేకం ఉన్నాయ‌న్నారు. అస‌లు మ‌నం దేనికైనా విలువ‌నిస్తే.. అది మ‌న ద‌గ్గ‌ర నుంచి పోతే మ‌న‌కు చాలా భ‌య‌మేస్తుంద‌ని చెప్పారు. అయితే మీ వెనుక ఏముంది ? ఏం చూసుకుని మీరింత ధైర్యంగా ఉంటారు.. అని ఆయ‌న్ను ప్ర‌శ్నిస్తే.. అందుకు వ‌ర్మ స్పందిస్తూ… నాకు ఉన్న‌ది ధైర్యం కాదు.. అది అండ‌ర్‌స్టాండింగ్ అని చెప్పుకొచ్చారు.

 

ఇంకా వ‌ర్మ ఇదే విష‌యంపై మాట్లాడుతూ… మన దేశంలో ఉన్న రాజ‌కీయ పార్టీల‌పై మాట్లాడ‌గ‌ల‌ను. కానీ దావూద్ ఇబ్ర‌హీం గురించి ఏమీ అన‌లేను క‌దా. అలా అంటే వెంట‌నే నాకు సైలెంట్ గా ఏదో ఒక వైపు నుంచి బుల్లెట్ దూసుకువ‌చ్చి తాకుతుంది. అప్పుడు నేనుంను క‌దా. అలాగే మొన్న ప‌వ‌న్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆయ‌న ఫిలిం చాంబ‌ర్‌కు వ‌చ్చిన‌ప్పుడు నాపై అనేక దారుణ‌మైన కామెంట్లు చేశారు. న‌న్ను చంపేస్తాన‌ని, న‌రికేస్తాన‌ని బెదిరించారు. కానీ ఏమైనా చేశారా ? చేయ‌గ‌లిగారా ? అదంతా కెమెరా ముందు వ‌ర‌కే. కెమెరా తీయ‌గానే అంద‌రూ సాధార‌ణ మ‌నుషులుగానే అయిపోతారు. ఆ రోజు కూడా వారు కెమెరా ముందు అలా మాట్లాడారు. త‌రువాత మ‌హేష్ బాబు సినిమాకు వెళ్లుంటారు.. అని న‌వ్వుతూ వ‌ర్మ స‌మాధానం చెప్పారు. అలాగే.. ప‌వ‌న్ ఫ్యాన్స్ అంత ధైర్యంగా మాట్లాడ‌డం వెనుక ఉన్న మ‌రో కార‌ణం వారికి ఉన్న సెల్‌ఫోన్లేన‌ని, వారు సెల్‌ఫోన్ల‌లో ఏమైనా మాట్లాడ‌తార‌ని, కానీ అలా ఇంట్లో మాట్లాడ‌లేర‌ని, ఎందుకంటే అమ్మానాన్న అలాంటి విప‌రీత‌మైన ప‌దజాలం వింటే ఏమైనా అంటారేమోన‌నే భ‌యంతో ఆ ఫ్యాన్స్ ఇండ్ల‌లో ఉన్న‌ప్పుడు ఫోన్ల‌లో అలాంటి ప‌దాలు మాట్లాడ‌లేర‌ని వ‌ర్మ చెప్పారు.. కాగా ప‌వ‌న్ ఫ్యాన్స్‌పై వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లు మ‌రోసారి నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. అయితే దీనిపై ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌రి ఏమ‌ని స్పందిస్తారో చూడాలి..!

 

Comments

comments