ఆ తెలుగు ఛానల్ పై క్రిమినల్ కేసు పెట్టిన “రామ్ గోపాల్ వర్మ”.! ఛానల్ మూసుకోవాల్సిందేనా.? ఇంతకీ ఏ ఛానల్!

ఇటీవల వివాదాస్పదమైన రాంగోపాల్ వర్మ ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ విషయంలో వర్మ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ  సినిమాపై కొన్ని టీవీ చానెళ్ల చర్చల సందర్భంగా వర్మ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా  సామాజిక కర్త దేవి, ఐద్వా నేత మణిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వర్మను సీసీఎస్‌ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే..ఇదిలా ఉండగా వర్మ ఒక న్యూస్ ఛానెల్ పై కన్నెర్ర చేశారు…

టీవీ9 చానెల్‌పై క్రిమినల్‌  కేసులు పెట్టనున్నట్టు వర్మ తాజాగా ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం తాను అదే పనిలో  ఉన్నానని, తన లాయర్లు కూడా అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆ  ట్వీట్‌లో తెలిపారు.వాస్తవాలను వక్రీకరించడమే కాదు.. తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని, ప్రస్తుతం జరుగుతున్న విచారణ గురించి న్యూస్‌లీకులు ఇవ్వడం కూడా నేరమేనని, ఇందుకు టీవీ9ను చట్టప్రకారం ఎదుర్కొంటానని, ముంబైలోని తన 27 అంతస్తు టెర్రాస్‌లో ఆ కథనాలు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నానని అంతకుముందు వర్మ ట్వీట్‌ చేశారు.

అంతేకాదు టీవీ9 పేరును టీవీ9 సర్కస్‌ జోకర్స్‌గా మార్చాలంటూ ఘాటుగా విమర్శించారు. మొన్నటివరకు వర్మ ప్రతి రోజు గంటల తరబడి డిబేట్లు నడిపిన ఛానెల్ పై ఎందుకు కన్నెర్ర చేశారు.నిజంగానే టివి9 ఉన్నవి లేనట్టుగా చూపిస్తుందా..వర్మని అవమానపరుస్తుందా..మరి జిఎస్టి ముందు వరకు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ పేరుతో జిఎస్టికి ఫ్రీ పబ్లిసిటి ఇచ్చింది ఇదే టివి9 కదా..అప్పుడు లేని కోపం ఇఫ్పుడెందుకొస్తుంది వర్మకి అనే విమర్శలు వినిపిస్తున్నాయి.. మహిళలను అవమానించినందుకు  వర్మ అరెస్ట్ అవుతాడా..లేకపోతే తప్పుడు న్యూస్ ప్రసారం చేస్తుందన్న కారణంతో టివి9 చిక్కుల్లో పడుతుందా వేచి చూడాలి…

Comments

comments

Share this post

scroll to top