“రంగస్థలం” కథ ఇదే అంట.! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ స్టోరీపై మీ కామెంట్ ఏంటి.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. లెక్కల మాస్టరు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత హీరోయిన్. ఇప్పటికే విడుదల చేసిన ఆడియో సాంగ్స్, ట్రైలర్, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం అందించిన సంగీతం ఈ సినిమాని మరో మెట్టు ఎక్కించింది. ఆ అంచనాలని అందుకునేలా ఈ సినిమా ఉంటుందని, రామ్ చరణ్‌కి ఈ సినిమాతో మంచి పేరు వస్తుందని రీసెంట్‌గా జరిగిన చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న అందరూ తెలిపిన విషయం తెలిసిందే. పూర్తి గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్, ఆది పినిశెట్టి, అనసూయ, జబర్దస్త్ శ్రీను, మహేష్ మొదలగు వారు ఇతర పాత్రలలో నటించారు.
ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ సినిమా పూర్తి మర్డర్ మిస్టరీగా ఉంటుందని, ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ చక్కర్లు కొడుతుంది. ‘‘చిట్టిబాబు (రామ్‌చరణ్), కుమార్ బాబు (ఆది పినిశెట్టి).. ఇద్దరూ అన్న తమ్ములు. రంగస్థలం ఊరి ప్రెసిడెంట్ జగపతి బాబు. అనుకోని పరిస్థితుల వల్ల కుమార్ బాబు ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తాడు. దీనితో జగపతి బాబు.. ఆది పినిశెట్టిని చంపేస్తాడు. తన అన్న చావుకి కారణమైన వారిని చరణ్ ఎలా తుదముట్టించాడనేదే సినిమా కథ’’ అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుందీ స్టోరీ. అయితే ఇదంతా ట్రైలర్‌లో ఉన్న విషయానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిరంజీవి రివీల్ చేసిన కీ పాయింట్‌ని జోడించి ఇలా కథను అల్లేశారని, సినిమాలో మ్యాటర్ బోలెడంత ఉందని మెగాభిమానులు ఈ కథపై కామెంట్లు చేస్తున్నారు. ఏ విషయం తెలియాలంటే మాత్రం మార్చి 30 వరకు ఆగాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top