రామ్ చరణ్ కొత్త ఇంటి ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!! సౌత్ ఇండియా స్టార్స్ లో అతి ఖరీదైనది.!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త ఇంటి ఖరీదు తెలుసుకున్న వాళ్లంతా నోరెళ్లబెడుతున్నారు, సౌత్ ఇండియా హీరో లలోనే అత్యంత ఖరీదైన ఇల్లు ఉన్న హీరో గా రామ్ చరణ్ కొత్త రికార్డు సృష్టించాడు, రామ్ చరణ్ ఒక సినిమాకు 15 కోట్ల నుండి 18 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడు, కొన్ని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.

బిజినెస్ నుండి ప్రొడ్యూసర్ దాకా.. :

కొన్ని వ్యాపారాలు కూడా మొదలెట్టాడు రామ్ చరణ్, మెగా స్టార్ చిరంజీవి గారు హీరో గా నటించిన ఖైదీ నెం.150 సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించాడు, అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హీరో గా నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన సై రా నరసింహారెడ్డి చిత్రానికి కూడా రామ్ చరణ్ ఏ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇంటి విలువ.. :

జూబ్లీ హిల్స్ లో ఒక విలాసవంతమైన ఇల్లును 38 కోట్లకు రామ్ చరణ్ కొనుగోలు చేసాడంట, 38 కోట్లు అంటే మామూలు విషయం కాదు, సౌత్ ఇండియన్ హీరోస్ లోనే అత్యంత ఖరీదు గల ఇల్లు కలిగిన హీరో గ రామ్ చరణ్ నిలిచిపోయాడు, రామ్ చరణ్ కు సుమారుగా 1000 కోట్లకు పైగానే ఆస్తి ఉందని సమాచారం, అంత ఆస్తి ఉన్నప్పుడు అంత ఖరీదైన ఇంట్లో ఉండటం తప్పులేదు, ఉండాలనుకోడం లోను తప్పు లేదని చాలా మంది అంటున్న మాట.

వినయ విధేయ రామ డిస్ట్రిబ్యూటర్లకు అండగా.. :

నిర్మాత దానయ్య తో రామ్ చరణ్ సంప్రదింపులు జరిపి వినయ విధేయ రామ డిస్ట్రిబ్యూటర్ లకి 5 కోట్లు ఇవ్వాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నాడని సమాచారం, ఇందుకు దానయ్య అంగీకరించడం తో దానయ్య 5 కోట్లు రామ్ చరణ్ 5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ లకి తిరిగిచ్చారు అంట. బోయపాటి కి ఇక్కడే చిక్కు వచ్చి పడింది. బోయపాటి సినిమాలు అంటే మాస్ జనాలకు పండగే, బోయపాటి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు అదరహో అనే రేంజ్ లో ఉంటాయి, కొడితే ఎగిరి పడే సీన్స్ అయితే చాలానే ఉంటాయి, వినయ విధేయ రామ చిత్రం లో కూడా అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయ్, కానీ కేవలం రెండు మూడు సీన్స్ మాత్రమే జనాలను ఆకట్టుకున్నాయి వినయ విధేయ రామ సినిమాలో, ఆ రెండు మూడు సీన్ లు మినహా మిగిలిన సినిమా అంత జనాలను ఆకట్టుకోలేదు.

నేనివ్వా.. :

రామ్ చరణ్, బోయపాటి ని కూడా డిస్ట్రిబ్యూటర్లకు 5 కోట్లు ఇవ్వమని అడిగినట్టు సమాచారం. అయితే బోయపాటి అంత ఇవ్వలేనని తెలిపాడంట, దీంతో దానయ్య రంగంలోకి దిగి, వినయ విధేయ రామ సినిమాకు 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నావ్, అందులో 5 కోట్లు తిరిగిస్తే ఏమవుతుందని అడగ్గా ఇద్దరి మధ్య కొట్లాట జరిగిందని సమాచారం, సినీ పెద్దల సమక్షం లోనే వాగ్వాదం జరిగిందని, బూతులు కూడా తిట్టుకున్నారు ఇరువురు అని వినిపిస్తున్న పుకారు, అయితే బహిరంగంగా అయితే ఎటువంటి వార్త బయటకు రాలేదు, అయితే ఇవి కేవలం పుకార్లేనా, లేక నిజంగానే జరిగిందా అని మెగా అభిమానుల్లోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా నెలకొన్న సందేహం.

 

Comments

comments

Share this post

scroll to top