రామ్ చరణ్ రాజకీయాల్లోకి రానున్నాడా, రాజకీయాల పైన క్లారిటీ ఇచ్చిన మెగా పవర్ స్టార్.!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నాడని సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతున్న వార్త, ఇటీవలే రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా తెరాస పార్టీ అధ్యక్షుడు కే.టీ.ఆర్ హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో కే.టీ.ఆర్ మాట్లాడిన మాటలను ఆధారంగా తీసుకొని పుకార్లు సృష్టించారు కొందరు.

రామ్ చరణ్ బాగా మాట్లాడాడు… రాజకీయాల్లోకి రావాలి :

రామ్ చరణ్ చాలా బాగా మాట్లాడాడు, ఇంత బాగా మాట్లాడే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని కే.టీ.ఆర్ గారు వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నారు, ఆ తరువాత నుండి అభిమానులే కాదు, సామాన్య ప్రేక్షకులు కూడా రామ్ చరణ్ త్వరలోనే రాజకీయాల్లోకి దిగనున్నాడు అని ప్రచారం మొదలెట్టారు.

క్లారిటీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ :

అయితే ఇదే విషయం అయి వినయ విధేయ రామ మూవీ ప్రొమోషన్స్ కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో స్పష్టత ఇచ్చారు రామ్ చరణ్, రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన లేదు, ఇండస్ట్రీ లో నాకంటే బాగా మాట్లాడే వారు ఎక్కువ మంది ఉన్నారు. నేను అభిమానులకు మంచి సినిమా ఇవ్వడానికే ఎప్పుడు ప్రయత్నిస్తా, ఇప్పట్లో అయితే రాజకీయాలకి వెళ్లే ఆలోచన లేదు అని రామ్ చరణ్ తెలిపారు.

భారీ స్థాయి లో :

వినయ విధేయ రామ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయి లో విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ఎక్కువ శాతం థియేటర్ లను సొంతం చేసుకున్నా, చాలా థియేటర్ లలో వినయ విధేయ రామ చిత్రం విడుదల అవుతుంది. బోయపాటి సినిమా కావడం తో మాస్ లో మంచి క్రేజ్ ఉంది ఈ సినిమాకు, బోయపాటి స్టైల్ లోనే టీజర్, ట్రైలర్ లు కూడా ఉండటంతో బీ,సీ సెంటర్ లలో వినయ విధేయ రామ చిత్రం దుమ్ము దులపడం ఖాయం.

 

 

Comments

comments

Share this post

scroll to top