ప్యాంటు వేసుకోలేదు అని రకుల్ పైన అసభ్యమైన కామెంట్ చేసిన నెటిజెన్, సంచలనం రేపుతున్న రకుల్ రిప్లై.!!

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కాలం లో సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తున్నారు, ఒకప్పుడు సంవత్సరానికి 4-6 సినిమాల్లో నటించిన రకుల్ చేతిలో ప్రస్తుతం 3-4 సినిమాలున్నాయి. టాలీవుడ్ బడా హీరోలతో ఆడిపాడిన రకుల్, తమిళ్ సినిమాల్లో కూడా నటించింది. ఈ అమ్మడు నటించిన దేవ్ చిత్రం తెలుగు, తమిళ్ బాషలలో ఫిబ్రవరి 14 వ తారీఖున విడుదల కానుంది. దేవ్ సినిమాలో కార్తీ హీరో గా నటించాడు.

సెషన్ తరువాత ప్యాంటు వేసుకోడం మర్చిపోతే.. :

సోషల్ మీడియా లో రకుల్ పిక్స్ మాత్రం ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంటాయి, అలాగే రకుల్ పిక్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఆ పిక్ పైన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేసారు, అందులో ఒక కామెంట్ కి రకుల్ సంచలనమైన రిప్లై ఇచ్చింది. అసలు ఆ కామెంట్ ఏంటంటే : ‘కారులో సెషన్ పూర్తయిన తరువాత రకుల్ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందని’ అసభ్యకరమైన కామెంట్ చేసాడు ఒక నెటిజెన్.

మీ అమ్మ… :

అయితే ఆ పోస్ట్ కి రకుల్ చాలా ఘాటుగా రిప్లై ఇచ్చింది : “నాకు తెలిసి మీ అమ్మ కార్ లలో ఎక్కువ సెషన్స్ చేస్తారు అనుకుంటా, అందుకే నువ్వు ఎక్స్పర్ట్ అయ్యావ్. ఈ కార్ సెషన్స్ గురుంచి ఏ కాకుండా కొంచెం బుద్ధి కూడా అడుగు మీ అమ్మకి. ఇలాంటి మనుషులు ఉన్నంత కాలం అమ్మాయిలు భద్రతగా బ్రతకలేరు, అమ్మాయిలకి అబ్బాయిలకి సమాన హక్కులు కావాలి, అమ్మాయిలకు భద్రత కావాలి అని చర్చలు జరిపితే కుదరదు ఊరికే” అని రకుల్ సమాధానమిచ్చింది.

అయితే రకుల్ కామెంట్ ని కొంత మంది సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది రకుల్ కామెంట్ పైన మండిపడుతున్నారు. వాడికంటే బుద్ధి లేదు కాబట్టి వాడు అలా అన్నాడు, నీ బుద్ధి ఏమైంది, వాళ్ళ అమ్మను ఎందుకు అన్నావ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, ఇలాంటి ఎదవలకు ఇలాగె రిప్లై ఇవ్వాలి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మనిషి కనిపించడంలోనే కాదు, భాషాతీరులోనూ శ్రీ రెడ్డి ని తలపిస్తుంది రకుల్ ప్రీత్.

Tweet

Comments

comments

Share this post

scroll to top