రకుల్ ప్రీత్ కె దిమ్మ తిరిగింది ఆ హోటల్ బిల్ చూసి.. ఒక పూట కె బయపడింది పాప..

రకుల్ ప్రీత్ సింగ్ ఈ సంవత్సరం మంచి ఊపు మీదుంది. గతేడాది సినిమాలు తగ్గించేసిన అమ్మడు, ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవలే దేవ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో సూర్య నటించిన NGK చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది, సాయి పల్లవి ఇంకో హీరోయిన్ గా ఈ సినిమా లో కనిపించనుంది.

లండన్ బాబోయ్… :

ఇటీవలే రకుల్ ప్రీత్ తన ఫ్రెండ్స్ ని తీసుకొని లండన్ కి వెళ్ళింది, లండన్ లో ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేసింది రకుల్. కానీ లాస్ట్ కి దిమ్మ తిరిగింది రకుల్ కి. ఒక స్టార్ హోటల్ లో ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇచ్చింది రకుల్. ఉన్నది 10 మంది ఫ్రెండ్స్ ఏ, లాస్ట్ కి బిల్ చూసి 10 మందికే ఇంత బిల్ ఆ అని రకుల్ ఆశ్చర్యపోయింది. తిన్నది కొంచమైనా 10 లక్షల బిల్ అయ్యింది అంట. కంగు తిన్న రకుల్ బిల్ పే చేసి బయటికి వచ్చాక, ఇంకెప్పుడు ఈ స్టార్ హోటల్ కి వెళ్ళకూడదు అని నిర్ణయించుకుందట. ఈ విషయాన్నీ స్వయంగా రకుల్ ఏ పంచుకుంది. ఒక పుట కె అంత ఖర్చు అంటే మాములు మాటలు కాదని రకుల్ ఆవేదన వ్యక్తపరిచింది.

హిందీ టు తమిళ్.. :

హిందీ తెలుగు తమిళ్ సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. గత ఏడాది గ్యాప్ ని ఈ ఏడాది తో ఫిల్ చేయనుంది రకుల్. ఫ్యాన్స్ మాత్రం కొంచెం లావవ్వమని రకుల్ ని వేడుకుంటున్నారు. రకుల్ మాత్రం అందుకు ససే మీరా అంటుంది, మరీ బక్కగవ్వడమే తెలుగు లో రకుల్ ఛాన్స్ లను దెబ్బ తీసిందని అందరు అంటున్నారు, కొంచెం లావయ్యి మునపటి లాగే ఆకట్టుకుంటుందో, లేక ఇప్పటిలాగే అభిమానులని నిరుత్సాహ పరుస్తుందో వేచి చూడాలి.

 

Comments

comments

Share this post

scroll to top