మొన్న “అర్జున్ రెడ్డి” క్యారెక్టర్ ను విమర్శించారు..మరిప్పుడు “స్పైడర్” లో రకుల్ సెక్స్ కోసం వెంపర్లాట ఏమిటి?

అర్జున్ రెడ్డి సినిమా చూడగానే…చాల మంది ఫైర్ అయ్యారు. అర్జున్‌రెడ్డి పాత్ర చిత్రణపై కొద్దిరోజులపాటు సోషల్ మీడియా సమర్థనలు, విమర్శలతో దద్దరిల్లిపోయింది… వీడురా ప్రేమికుడు అన్నవాళ్లూ ఉన్నారు… వీడేం ప్రేమికుడు అన్నవాళ్లూ ఉన్నారు… అయితే స్పైడర్ సినిమాలో రకుల్ పాత్ర కూడా ఇప్పుడు అలంటి కాంట్రావర్స్ కి గురైంది

అసలు స్పైడర్ సినిమాలో ఆమె పాత్ర ఏమిటి..?

మెడిసిన్ స్టూడెంట్… ఎప్పుడూ పోర్న్ వీడియోలు చూస్తూ ఉంటుంది…నాలుగు గంటలు విరామం లేకుండ చూస్తుంది.  తప్పులేదు, ఈరోజుల్లో చూడనివాళ్లు ఎవరున్నారు అనుకుందాం. తన కోరిక తీర్చే అబ్బాయి కోసం బ్లైండ్ డేటింగుకూ రెడీ రెడీ అంటూ ఉంటుంది స్నేహితురాలితో… పెళ్లికి ముందే సెక్స్ కోసం బాగా ఆతృతగా ఉండే పాత్ర…


పెళ్ళికి ముందే సెక్స్ అనే కాన్సెప్ట్ అర్జున్ రెడ్డిలో కూడా ఉంది. అందువల్లే చాలా మంది విమర్శించారు. కానీ మరీ పోర్న్ వీడియోలు చూస్తూ, ఎవరు దొరుకుతారా బాబూ అని కోరికతో రగిలిపోయే పాత్ర… కథలో మహేష్ పాత్రతో ఈ పాత్రకు సాన్నిహిత్యం పెరిగాక… మా ఫ్రెండ్ ఇంట్లో ఎవరూ లేరు, తాళం తీసుకున్నాను, వచ్చెయ్ అంటుంది… సరే, అదీ పెద్ద తప్పు కాదు అనుకుందాం ఈరోజుల్లో… విలన్ విధ్వంసం స‌ృష్టించబోతున్న హాస్పిటల్ గురించి చెప్పటానికి రకుల్ కాల్ చేసినప్పుడూ మహేష్ ‘ఇప్పుడు కూడా అందుకే చేస్తున్నావా’ అంటాడు… అంటే ఆమె పాత్ర చిత్రణ అలా ఉంది…పోనీ సినిమాలో పెద్ద పాత్ర ఉందా అనుకుంటే..రోల్ ఇంపార్టెంట్ ఏం కాదు. ఒకప్పుడు మురుగదాస్ తీసిన “ఘజిని” సినిమాలో హీరోయిన్ పాత్ర చాల ముఖ్యమైంది. కానీ స్పైడర్ లో అది తగ్గిపోయింది.

Comments

comments

Share this post

scroll to top