విడుదలైన రజినీకాంత్ పేట తెలుగు ట్రైలర్, స్వీట్ తినబోతున్నాం…. అభిమానులకి పండగే!!

సూపర్ స్టార్ రజినీకాంత్ పేట ట్రైలర్ ని యూట్యూబ్ లో ఇవ్వాళ విడుదల చేసారు. తమిళ్ ట్రైలర్ కంటే తెలుగు ట్రైలర్ లోనే డైలాగ్స్ బాగున్నాయి అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

పోటీ లో కూడా రికార్డు స్థాయి లో పేట తెలుగు రైట్స్ :

తలైవర్ నవ్వు చూస్తే సంబరపడిపోయే జనాలు కొన్ని కోట్ల సంఖ్య లో ఉన్నారు, ఇప్పుడు మనమేం చేయబోతున్నాం …. స్వీట్ తినబోతున్నాం అంటూ ట్రైలర్ లో రజినికాంత్ ఒక చిన్న నవ్వు నవ్విన తరువాత ఆయన వేసే స్టెప్స్ కి థియేటర్ దద్దరిల్లిపోవడం ఖాయం. సంక్రాంతి కి బాలకృష్ణ హీరో గా నటించిన ఎన్టీఆర్ గారి బయోపిక్ ‘కథానాయకుడు’, రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’, వెంకటేష్ వరుణ్ తేజ్ ల ‘F2’ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి, ఇంత పోటీ లో కూడా పేట మూవీ తెలుగు రైట్స్ 21 కోట్లకు అమ్ముడుపోయాయి అంటే, కేవలం రజినీకాంత్ క్రేజ్ అనే చెప్పాలి. ఇటీవలే పేట మూవీ తమిళ్ ట్రైలర్ ని యూట్యూబ్ లో విడుదల చేసారు పేట టీం, ఆ ట్రైలర్ కు విపరీతమైన స్పందన వచ్చింది.

పేట సినిమా లో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దికీ, త్రిష, బాబీ సింహ, మేఘ ఆకాష్ నటీ నటులు గా నటించారు. అయితే ఈ సినిమాకు ఆకర్షణ మాత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ. ట్రైలర్ లో అయన స్మైల్ అండ్ స్టైల్ చూస్తుంటే అభిమానులు ఆనందం తో ఉభితబ్బిపైపోతున్నారు.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top