పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్న రజినీ కాంత్…వరద బాధితులకు 10 కోట్ల సహాయం.

స్టార్ హీరో అనిపించుకోవడానికి, అభిమానులు ఆ హీరో అడుగుజాడలలో నడవడానికి కొన్ని సందర్భాలే చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. దానికి తార్కాణమే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన జన్మదిన వేడుకలను జరుపోకోకుండా రూ. 10 కోట్ల ను చెన్నై వరద బాధితులకు విరాళంగా ఇచ్చాడు. ఇదివరకే రూ. 10 లక్షలు విరాళంగా ప్రకటించిన రజనీకాంత్, తాజాగా తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తమిళనాడు సీఎం జయలలితను కలిసి రూ.10 కోట్ల చెక్ ను అందించాడు.

Rajinikanth-Donates-Rs

ప్రస్తుతం 64 వయసులో ఉన్న రజనీ, ఈ శనివారం (డిసెంబర్ 12న) 65వ వడిలోకి ఎంటర్ అవుతున్నాడు. అయితే ప్రస్తుతం తమిళనాడు లో వరదల ధాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, అలాంటి సమయంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సరికాదని, తన జన్మదిన వేడుకలు జరపవద్దని రాష్ట్ర  ప్రజలకు సహాయం చేయవలసిందిగా అభిమానులు సహాయక చర్యల్లో పాల్గొనవలసిందిగా రజనీకాంత్ కోరారు. అయితే తన స్వచ్చంద సంస్థ ద్వారా మొదట రూ. 10లక్షలు ప్రకటించిన రజనీ, తాజాగా తనే సీఎంను కలిసి రూ. 10 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసి చెన్నై ప్రజలను ఆదుకోవాల్సిందిగా రజనీకాంత్ కోరారు
rajinikanth-jokes1.
ఇప్పటివరకూ తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్,కోలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రెటీస్ తమిళనాడు ప్రజలను ఆదుకునేందుకు విరాళాలు ప్రకటించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇంతవరకూ విరాళాలు ఎక్కువ ఇచ్చిన వారిలో రజనీకాంత్ రూ. కోటి.. పది లక్షలు అత్యధికంగా తమిళనాడు వరద బాధితుల కోసం ఇచ్చాడు.

Comments

comments

Share this post

scroll to top