రోబో సీక్వెల్ కు 300 కోట్లంట???

దక్షిణ భారత దేశంలో హాలీవుడ్ రేంజ్ డైరెక్టర్ అతను.. కొత్త యాంగిల్లో సినిమా తీసి మెప్పించాలన్నా, పెద్ద హీరోలతో డిపరెంట్ రోల్స్ చేయించాలన్నా, భారీ సినిమాలను తీయాలన్న ఆయనకు ఆయనే సాటి…రోబో సినిమాతో ఔరా అనిపించిన శంకర్… ఐ సినిమాతో కాస్త నిరాశ పరిచాడు. ఐ సినిమా మిగిల్చిన లోటు రోబో సీక్వెల్ తో పూడ్చడానికి రెడీ అయ్యాడు.

robo

 

160 కోట్లతో రోబో సినిమాను రూపొందించిన శంకర్ , రోబో సీక్వెల్ కోసం మాత్రం 300 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. ఇందులో కూడా సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా, అందాల ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదట ఈ భారీ సినిమాకు విలన్ గా  బాలీవుడ్ బాద్ షారుఖ్  పేరు తెర మీదకు వచ్చింది. కానీ ఆ స్థానాన్ని ఐ సినిమాలో విభిన్న గెటప్ లతో అదరగొట్టిన విక్రమ్ ను ఫిక్స్ చేశారట . దీని తర్వాత భారతీయుడు సీక్వెల్ కు కూడా శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు  సమాచారం.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top