బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో “చంద్రబాబు” పాత్రలో నటించే హీరో ఎవరో తెలుసా.?

ఒకవైపు నటసార్వభౌముడు ఎన్టీయార్ బయోపిక్,మరోవైపు మహానటి సావిత్రిగారి బయోపిక్..రెండు సినిమాలు అటు సినిమా వారు,ఇటు ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అంశాలు..అందుకే  ఆరెండు సినిమాల గురించి ఏ విధమైన విషయం బైటికి వచ్చినా ఆసక్తిగా చూస్తుంటారు..ఈ రెండు సినిమాలపై భారిగా అంచనాలు పెట్టుకోవడమే కాదు..ఈసినిమాల్లో రియల్ లైఫ్ పాత్రలను ఎవరు పోషిస్తారా అనేది మరో ఆసక్తిరమైన విషయం.అందులో భాగంగానే ఎన్టీయార్ బయోపిక్ గురించి ఒక వార్త టాలివుడ్లో చక్కర్లు కొడుతుంది..ఇందులో రాజశేఖర్ నటించనున్నారనేది ఆ వార్త..ఇంతకీ రాజశేఖర్  ఏ పాత్ర పోషిస్తున్నారో తెలుసా..

తేజ దర్శకత్వంలో బాలకృష్ణ.. తన తండ్రి పాత్ర పోషిస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. ఈ మధ్యే సినీరాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ నిజజీవితంలోని ముఖ్యపాత్రలను సినిమాలో ఎవరు పోషిస్తారనే విషయంపై ఇప్పటివరకు చిత్ర యునిట్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదివరకే కథలో కీలకమైన నాదెండ్ల భాస్కరరావు పాత్రకు బాలీవుడ్ నటుడు పరేష్‌ రావల్‌ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్‌ జీవితంలో కీలకమైన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రను హీరో రాజశేఖర్‌ పోషించనున్నట్లు  టాలీవుడ్‌ సమాచారం. హీరో రాజశేఖర్‌, బాలకృష్టలు ఇద్దరు మంచి సన్నిహితులు.అప్పట్లో గరుడవేగ సినిమా ప్రమోషన్‌లో పాల్గోన్న బాలకృష్ణను ఉద్దేశించి ఆయనతో కలిసి నటించాలనే కోరికను రాజశేఖర్‌ బయట పెట్టారు. దీంతో ఇద్దరం కలిసి ఓ మల్టీస్టారర్‌ సినిమా ప్లాన్‌ చేద్దాం అని బాలకృష్ణ సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌తో బాలకృష్ణ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రను హీరో రాజశేఖర్‌కు ఇచ్చారన్న టాక్‌ వినిపిస్తోంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభోత్సవం కార్యక్రమంలో జీవిత రాజశేఖర్‌లు పాల్గొనటం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది…ఇటీవలే  కాస్టింగ్ కౌచ్ విషయంలో బయిటికి వచ్చిన శ్రీరెడ్డికి తేజా అవకాశం ఇస్తామన్న విషయం తెలిసిందే ఒకవేళ ఇస్తే ఏ పాత్ర ఇస్తాడు..రాజశేఖర్ కి నారా చంద్రబాబు నాయుడు పాత్ర కన్ఫామా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర కోసం విద్య బాలన్ ని అడిగారు. అలాగే కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పాత్రలో పరేష్ రావెల్ కనిపించనున్నారు. సంతోష్‌ తుండియిల్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్న సినిమాలో ఇందిరాగాంధీ రోల్ ని నదియా పోషిస్తున్నారు. రాజశేఖర్ ,నారా చంద్రబాబునాయుడు పాత్రలో  నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి..

Comments

comments

Share this post

scroll to top