“పీఎస్వీ గరుడ వేగ” తో “రాజశేఖర్” హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)..!

Movie Title (చిత్రం): పీఎస్వీ గరుడవేగ (PSV GARUDAVEGA)

Cast & Crew:

 • నటీనటులు: రాజశేఖర్, పూజ కుమార్, శ్రద్ధ దాస్, సన్నీ లియోన్ తదితరులు
 • సంగీతం: శ్రీచరణ్ పాకాల
 • నిర్మాత: కోటేశ్వర రాజు, మురళి (Jyo Star Enterprises)
 • దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

Story:

NIA ఆఫీసర్ గా “రాజశేఖర్” ఇంట్రడక్షన్ తో ఈ సినిమా మొదలవుతుంది. డ్రగ్ మాఫియా కేసులను క్లోజ్ చేసిన తర్వాత ఒక మర్డర్ కేసు మిస్టరీని చేదించమని రాజశేఖర్ కు అపచెప్పుతారు. వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. హత్యల వెనకున్న కారణం తెలుసుకోవాలి అనుకుంటాడు రాజశేఖర్. ఈ సమయంలో టీవీ రిపోర్టర్ (శ్రద్ధ దాస్) తో పరిచయం ఏర్పడుతుంది. చివరికి మిస్టరీ ఎలా కనిపెట్టాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!

Review:

‘పిఎస్‌వి గరుడవేగ’ ఓ కొత్త ప్రయోగం. చాన్నాళ్ల తరవాత రాజశేఖర్ ఒక యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా ఫస్టాప్‌ను దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దారు. చాలా ఎంగేజింగ్‌గా, ఆసక్తికరంగా సాగిపోతుందట తొలి భాగం. అయితే సెకండాఫ్‌పై మాత్రం దర్శకుడు పట్టుకోల్పోయాడు. అన్ని సినిమాల్లో ఉన్నట్టే రొటీన్ సెకండాఫ్.ఇక రాజశేఖర్ నటన విషయానికి వస్తే మరోసారి తన అద్భుతమైన నటనతో కట్టిపడేసారట. తొలిభాగం చాలా థ్రిల్లింగ్, ఒక రేస్‌లా పరిగెత్తిందని.. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే ‘గూస్‌బంప్స్’.సినిమాను చాలా రిచ్‌గా నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం సినిమాకు మరో బలం. మొత్తానికి సినిమా అయితే బాగుందని ప్రేక్షకుల మాట.

Plus Points:

 • రాజశేఖర్ పెర్ఫార్మన్స్
 • సినిమాటోగ్రఫీ
 • సంగీతం
 • ఇంటర్వెల్ సీన్
 • స్టోరీ
 • డైరెక్షన్

Minus Points:

 • ఎడిటింగ్
 • స్లో సెకండ్ హాఫ్

Final Verdict:

చాలా రోజుల తరవాత మంచి థ్రిల్లింగ్ కథతో ముందుకి వచ్చిన “రాజశేఖర్” కాతాలో హిట్ ఇచ్చింది “గరుడవేగా”

AP2TG Rating: 3.75 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top