ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా.? హీరోయిన్ గా రానున్న ఓ హీరో కూతురు..!

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అంటుంటారు చాలామంది..డాక్టర్ అయి యాక్టర్ అయ్యారు రాజశేఖర్..ఇప్పుడు తండ్రి బాటలోనే కూతురు పయనిస్తుంది.రాజశేఖర్, జీవితల గారాలపట్టి శివాని కూడా తండ్రిలానే వైధ్యవిధ్య అభ్యసిస్తుంది..మరోవైపు సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తుంది..ఇటీవల జరిగిన ఫోటో షూట్స్ ,ఆడియో లాంచ్ ప్రోగ్రాంలలో శివాని మెరవడం శివాని స్క్రీన్ ఎంట్రీని కన్ఫామ్ చేస్తుంది..

జన్మతహ తమిళుడైనప్పటికి తెలుగు నటుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు రాజశేఖర్..సహనటి జీవితను పెళ్లి చేసుకున్నారు.పెళ్లి సమయానికి ఇద్దరూ ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో యాక్ట్ చేశారు..రీల్ కపుల్ గానే కాదు రియల్ కపుల్ గా కూడా మార్కులు కొట్టేసారు..వారికి ఇద్దరు పిల్లలు శివాని,శివాత్మిక..ఇప్పుడు పెద్ద కూతురు శివాని హీరోయిన్ గా తెరంగేట్రం చేయబోతుంది..ఇప్పటికే ఈ భామ ఒకవైపు కళలు, డాన్స్, మార్షల్ ఆర్ట్స్ లో మెలుకువలు నేర్చుకుంటుంది..మరోవైపు, మెడిసిన్ కూడా చదువుతోంది. తన ఆకర్షణీయనమైన పర్సనాలిటీ, అందం తో అందరి దృష్టిని ఆకర్షించింది .

హిందీ, తెలుగు, తమిళ పరిశ్రమల్లో పలువురు హీరోయిన్లను లాంచ్ చేయడంలో కీలక పాత్ర పోషించిన క్వాన్ కంపెనీ ద్వారా శివాని టై అప్ అయింది అంటున్నారు..నిర్మాత రాజ్ కందుకూరి కుమారుని హీరోగా పరిచయం కాబోతున్న సినిమాతోనే శివాని కూడా టాలివుడ్ కి పరిచయం అవుతుంది అంటున్నారు..ఏది ఏమైనా శివాని ఎంట్రీతో మరోక వారసురాలు మెరవనుందన్నమాట…

Comments

comments

Share this post

scroll to top