రాజశేఖర్ ,జీవితా చిరంజీవి ఇంటికి ఎందుకెళ్లారు.? అక్కడ ఏం జరిగింది.? అసలు వీరిద్దరి మధ్య గొడవ ఏంటి.?

ఎవరూ శాశ్వత శతృవులు ,శాశ్వత మిత్రులు  ఉండరు అనే మాట వింటుంటాం.ఈ మాట ఎక్కువగా రాజకీయాల్లో వాడుతుంటాం..సినీరంగానికి కూడా ఈ మాట వర్తిస్తుంది.  దరు బంధాలకు విలువిచ్చినప్పటికీ చాలావరకూ పరిస్థితులే వారి మధ్య సంభందాలను నడిపిస్తుంటాయి.రాజశేకర్ కి చిరంజీవికి అస్సలు పడదనే  విషయం మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్టు ఉండేది వీరి మధ్య..కానీ ఇప్పుడు ఇద్దరూ కలిసిపోయారా అనే వార్తలు జోరందుకున్నాయి..దీనికి కారణం జీవితా,రాజశేఖర్ ఇద్దరూ చిరంజీవి ఇంటికి వెళ్లడమే..అసలు వీరిద్దరూ ఎందుకు వెళ్లారు,,అక్కడ ఏం జరిగింది..

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా రాజశేఖర్, జీవిత ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నారు .ఒక దశలో ఇద్దరి మధ్య మాటల యుద్దం జోరుగానే సాగింది.ఈ గొడవకు ఆజ్యం ఎక్కడ పోసారా అనే ఆలోచన చేస్తే రాజశేకర్ చెయ్యాలనుకున్న ఒక సినిమాని చిరు చేసాడని అంటారు..ఎంత వరకు వాస్తవం అనేది ఎవరికి తెలియదు..ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి మామూలే ఒక హీరో కోసం రాసుకున్న కథ మరో హీరో చేయడం,ఒక హీరో కాదంటే ఆ కథ మరో హీరోని వరించడం..ఒకవేళ ఆ వార్తే నిజమయితే ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద ఇష్యూగా ఎందుకు చేసారో వారికే తెలియాలి.కానీ ఇప్పుడు వీరిద్దరూ కలిసిపోయారనేదానికి నిదర్శనం ఏంటంటే చిరంజీవి ఇంటికి రాజశేఖర్,జీవిత వెళ్లడమే… రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా ప్రిమియర్ షో చూడటానికి రావాలని చిరంజీవిని పిలవడానికి రాజశేఖర్, జీవిత కలసి చిరు ఇంటికి వెళ్ళారని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి రాజశేఖర్ ని చూసి చాలా సాదరంగా ఆహ్వానించి, ఎన్నో కుశల ప్రశ్నలు వేస్తూ మాట్లాడారట.అంతేకాదు చిరంజీవి భార్య  సురేఖ , జీవితాని లోపలకి తీసుకుని వెళ్లి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారట. దీనిని బట్టి ఇప్పుడు చిరు, రాజశేఖర్ మద్య మల్లి స్నేహం చిగురిస్తుందని అందరు అనుకుంటున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

watch video here:

Megastar #Chiranjeevi garu likes #PSVGarudaVega trailer& wishes Rajasekhar a big comeback. Garuda Vega Praveen Sattaru Shraddha Das Pooja Kumar Adith Sunny Leone

Posted by Garuda Vega on Thursday, 2 November 2017

రాజశేఖర్ కి గత కొంతకాలంగా సినిమాలు లేవు,కూతురు శివాని హీరొయిన్ గా పరిచయం కాబోతున్నారన్నారుకానీ అది ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు..మరోవిషయం రాజశేఖర్ తల్లిని కోల్పోయి దుంఖ:లో ఉన్నారు..ఇప్పుడు జీవిత వాల్ల అన్నయ్య కూడా చనిపోయి వారికి ,సినిమా రిలీజైన ఆనందం లేకుండాపోయింది… మరో వైపు చిరంజీవి పరిస్థితి కూడా అంతే రాజకీయాల్లో జీరోగా మిగిలిపోయి మళ్లీ సినిమాలవైపుకి మళ్లారు..దీంతో ఒక గూటి పక్షులే ఒకర్నొకరు అర్దం చేసుకోవాలి,కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా అన్నట్టుంది వీరి కథ…వీరిద్దరూ కలిసిపోయిన వార్త నిజమే అయితే ఒకే ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్న వాళ్ళు అందరూ కలసి మెలసి ఉండటం మంచిదే అని నెటిజనులు అనుకుంటున్నారు…

రాజశేఖర్, పూజా కుమార్, శ్రద్ధాదాస్, సన్నీలియోన్ మొదలగు వారు ముఖ్య తారాగణంగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ‘పీఎస్వీ గరుడవేగ’ చిత్రం నవంబర్ 3న అత్యధిక ధియేటర్లలో రిలీజైంది. రిలీజైన ప్రతి చోటా మంచి టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ముఖ్యంగా కొంతకాలంగా సరైన హిట్ లేక, సరైన సినిమా కోసం చూస్తున్న రాజశేఖర్‌కి ఈ సినిమా కొత్త ఊపిరినిచ్చింది. చాలా కాలంగా హిట్ అనే పదానికి దూరమైన రాజశేఖర్‌, ఈ సినిమాపై వస్తున్న పాజిటివ్ టాక్‌తో చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ ఆనందాన్ని చిత్ర యూనిట్‌తో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ ఇళ్లంతా గరుడవేగ కాంతులతో నిండిపోయింది. తన ఇంటి వద్ద చిత్ర యూనిట్‌తో కలిసి రాజశేఖర్ డ్యాన్స్‌లు చేస్తూ అలరించారు. ప్రస్తుతం రాజశేఖర్ ఇంటి వద్ద పండగ వాతావరణం నెలకొని ఉంది.

watch video here:

Age is just a number whenever you're happier in this world 😍😍 Rajashekar garu enjoying Garudavega Success at his residence 👏👏😉

Posted by Thyview Video Library on Friday, 3 November 2017

Comments

comments

Share this post

scroll to top