రజినీకాంత్ పేట సినిమా తెలుగు హక్కులు ఎంతకి అమ్ముడుపోయాయి తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన పేట సినిమా జనవరి 10 న తెలుగు, తమిళ్ బాషలలో విడుదల కానుంది. ఈ సినిమా రైట్స్ ని తెలుగు లో ప్రముఖ నిర్మాత అశోక్ వల్లభనేని భారీ మొత్తం లో సొంతం చేసుకున్నారు. 21 కోట్ల రూపాయలకు ఈ సినిమాను సొంతం చేసుకున్నారు అశోక్ వల్లభనేని.

సంక్రాంతి కోళ్లు :

సంక్రాంతి కి బాలకృష్ణ హీరో గా నటించిన ఎన్టీఆర్ గారి బయోపిక్ ‘కథానాయకుడు’, రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’, వెంకటేష్ వరుణ్ తేజ్ ల ‘F2’ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి, ఇంత పోటీ లో కూడా పేట మూవీ తెలుగు రైట్స్ 21 కోట్లకు అమ్ముడుపోయాయి అంటే, కేవలం రజినీకాంత్ క్రేజ్ అనే చెప్పాలి. ఇటీవలే పేట మూవీ తమిళ్ ట్రైలర్ ని యూట్యూబ్ లో విడుదల చేసారు పేట టీం, ఆ ట్రైలర్ కు విపరీతమైన స్పందన వచ్చింది

పేట సినిమా లో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దికీ, త్రిష, బాబీ సింహ, మేఘ ఆకాష్ నటీ నటులు గా నటించారు. అయితే ఈ సినిమాకు ఆకర్షణ మాత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ ఎ. ట్రైలర్ లో అయన స్మైల్ అండ్ స్టైల్ చూస్తుంటే అభిమానులు ఆనందం తో ఉభితబ్బిపైపోతున్నారు. ట్రైలర్ చివర్లో రజినీకాంత్ డాన్స్ స్టెప్స్ వేస్తూ వచ్చే సీన్ అయితే ట్రైలర్ కె హైలైట్. ఇంక ట్రైలర్ చివర్లో అయన నవ్వు చూస్తే మనకు చిన్న పిల్లోడే గుర్తొస్తాడు. తెలుగు ట్రైలర్ ని తొందర్లోనే విడుదల చేయనున్నారు.

 

 

Comments

comments

Share this post

scroll to top