“భల్లాలదేవుడి” భార్య ఎవరు అనే ప్రశ్నకు “రాజమౌళి” ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా..?

బాహుబలి తొలి భాగం రిలీజ్ అయిన దగ్గర నుంచి సినీ జనాలను వేదిస్తున్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? అయితే ఈ ప్రశ్నకు బాహుబలి 2 సమాధానం ఇచ్చిన దర్శకుడు రాజమౌళి, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే బాహుబలి 2వ భాగాన్ని ముగించేశాడు. ఇప్పుడు ఆ సమాధానం దొరకని ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

బాహుబలి తొలి భాగంలో శివుడు, భల్లాలదేవుడి కొడుకు భధ్రని తల నరికి చంపాడు. అయితే రెండో భాగంలో భల్లాలదేవుడి భార్యకు సంబంధించిన సన్నివేశాలుంటాయి భావించిన ప్రేక్షకులకు ఆమె ఎవరన్నది సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది.

పార్ట్ – 3 ఉంటుందా..? అనే అనుమానానికి కూడా తెర తీసింది ఈ డౌట్. సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న “భల్లాలదేవుడి భార్య ఎవరు?” అనే ప్రశ్నకు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు స్పందించారు.

“భల్లాలదేవుడికి భార్య ఎవరు లేరు..! “భద్ర” దత్త పుత్రుడు. “దేవసేన” దక్కకపోవడంతో “బ్రహ్మచారి” గా మిగిలిపోయాడు “భల్లాలదేవ”. బాహుబలి -3 లేదని కూడా చెప్పేసారు. ఎడిటింగ్ కారణంగా ఈ విషయం సినిమాలో చెప్పలేకపోయాము. ఇప్పటికే సినిమా లెంత్ ఎక్కువ అయ్యింది”

Comments

comments

Share this post

scroll to top