సినిమా సూపర్ అని కొందరు, లేదు లేదు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదని ఇంకొందరు ఇలా బాహుబలి పై ఎవరికి తోచిన రివ్యూ వారు రాసేశారు. వారి వారి పేస్ బుక్ టైమ్ లైన్స్ మీద..కానీ ఇప్పడు మీ రివ్యూకు గట్టి డిమాండ్ వచ్చిపడింది. ఏకంగా బాహుబలి డైరెక్టర్ రాజమౌళియే స్వయంగా మీ రివ్యూ కావాలి, తప్పకుండా పంపించండి అంటూ రిక్వెస్ట్ చేశాడు.
ఇప్పుడు మీరిచ్చిన రివ్యూలను తీసుకొని తన బాహుబలి పార్ట్-2 లో చేయాల్సిన మార్పులు,చేర్పుల మీద పెద్ద కసరత్తు చేయడానికి రెడీ అయిపోతున్నాడు ఈ జక్కన్న…. సినిమా విడుదలైందీ, క్రిటిక్స్ రేటింగ్స్ వచ్చేశాయ్,ఇంకా సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. ఇలాంటప్పుడు ఈ ఆపర్ ఏంటని సినీ విశ్లేషకులు విశ్లేషణ కూడా స్టార్ట్ చేశారు.
సోషల్ మీడియాను వాడుకోవడంలో రాజకీయాల్లో మోడీ అయితే సినిమాల్లో మాత్రం రాజమౌళి యే అనే రేంజ్ కు వెళ్లారు జక్కన్న. సోషల్ మీడియాను తన బాహుబలి స్టార్టింగ్ నుండి రిలీజ్ వరకు ఎంతగా వాడుకున్నారంటే… ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉండేంతగా.. నిజం చెప్పాలంటే బాహుబలి గ్రాండ్ సక్సెస్ కు నెట్ వరల్డ్ దే సింహభాగం.
మరోసారి ప్రేక్షకులతో తనతో తన సినిమాతో టచ్ లో ఉండేందుకు రాజమౌళి ఈ రివ్యూ మంత్రాన్ని జపిస్తున్నారని సినీ విమర్శకుల వాదన.. పార్ట్-2 కోసం సలహాలు తీసుకోవడం కూడా ఇందులో భాగం కాబోలు…..