CONFIRMED: “బాహుబలి”ని మించిన మల్టీస్టారర్ తో “రాజమౌళి”..! ఇద్దరు అగ్రహీరోలు ఎవరో తెలుసా..?

వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకులకు పండగే పండుగ..బాహుబలి తర్వాత రాజమౌలి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా ఏంటా అని జక్కన అభిమానులు వెయిట్ చేస్తుంటే.. రాజమౌలి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై రకరకాల ఊహాగానాలు వచ్చాయి.ఇప్పటికి ఆర్నెళ్లకు పైనే అయిందనుకుంటా బాహుబలి 2 వచ్చి.. కానీ ఇప్పటివరకూ రాజమౌలి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాత్రం ఏం తెలియలేదు..కానీ జక్కన చేసిన ఒక ట్వీట్ మొత్తం టాలివుడ్ ప్రజలను తనవైపుకు తిప్పుకుంది..

నెక్స్ట్ ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభమవబోతుందని ఆ ట్వీట్ సారాంశం..ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమంటే ఆసినిమాలో ఎన్టీయార్,రాంచరణ్ ఇద్దరునటించబోతున్నారు.ఈ విషయాన్ని రాజమౌలే స్వయంగా తన ట్విటర్ ద్వారా తెలియచేసారు.అంతేకాదు తాను ,ఎన్టీయార్,చరణ్ ముగ్గురు కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసారు రాజమౌలి. .టాలివుడ్ కి చెందిన ఇద్దరు టాప్ హీరోలు నటిస్తున్నారంటే వారి అభిమానులకే కాదు మిగతా సినిమా ప్రేక్షకులకు కూడా ఆనందమే.ఎందుకంటే మల్టీస్టారర్ సినిమాలకు మన వాళ్లు అంత ప్రాముఖ్యం ఇవ్వరు.వాళ్లు పర్సనల్ గా ఎలా ఉన్నప్పటికీ సినిమాల విషయంలో కొంచెం పోటీతత్వం ఉటుంది.దాంతో ఫ్యాన్స్ మద్య కూడా మంచి వాతావరణం కూడా ఉండదు.కానీ జక్కన ఈ ట్వీట్ తో దెబ్బకు అంత సెట్రైట్ అవుతుందనిపిస్తుంది.ఇప్పటికే బాహుబలిలో ప్రభాస్,రాణాలు కలిసినటించారు.ఎవరి పాత్ర వారికే ప్రత్యేకంగా తీర్చిదిద్దారు రాజమౌలి.ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీయార్,రాంచరణ్ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో అంటే అంచనాలు భారిగానే ఉంటాయి..ఇది జక్కన అభిమానులకు,ఎన్టీయార్,రాంచరణ్ అభిమానులకే కాదు… సిని అభిమానులకే ఆసక్తికరమైన విషయం..అంతేకాదు తెరమీద ఇద్దరు టాప్ హీరోలు,దర్శకదీరుడు రాజమౌలి డైరెక్షన్ అంటే ప్రేక్షకులకు కన్నులపండుగే…

Comments

comments

Share this post

scroll to top