జక్కన నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేనెలలోనే..హీరో ఎవరనుకుంటున్నారూ??

తెలుగు సినిమా సత్తాను  ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనత జక్కనది.బాహుబలి,బాహుబలి2  సౌత్ సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ రేంజ్ కు తీసుకెళ్లాయి.బాహుబలి రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా రాజమౌలి నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఇంకా తెలియలేదు.సాధారణంగా దర్శకులు ఒక సినిమా ముగిసేలోపు ఇంకో సినిమా గురించి  ఆలోచించడమో,ఆ పనులు కూడా ప్రారంభించడమో చేస్తుంటారు..కానీ రాజమౌలి ఇప్పటి వరకు ఒక సినిమా పూర్తిగా కంప్లీట్ అయ్యాకే వేరే సినిమా వైపు వచ్చేవారు..తను తీసుకున్న ప్రాజెక్ట్ కు ఎన్ని సంవత్సరాలు పట్టినప్పటికీ  ఆ సినిమా వర్క్ మీదే పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టేవారు.దానికి ఉదాహరణ బాహుబలి..బాహుబలి ప్రాజెక్ట్ కి సైన్ చేసి,దీనికి వర్క్ చేస్తున్న టైంలోనే  ప్రభాాస్ మిర్చి సినిమా కూడా చేసారు..అన్నేండ్ల కాలం పాటు రాజమౌలి ఈ ఒక్క సినిమా మీదే వర్క్ చేశారు.. ఇప్పుడు రాజమౌలి నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ నెక్స్ట్ మంథ్ లో ఉంటుందట..

ఇప్పటివరకు తర్వాత  చిత్రం ఏమిటనేది అఫీషియల్ గా ఎనౌన్స్ చేయకపోవడంతో.. అల్లు అర్జున్ తో అని కొందరు, ఎన్టీయార్ తో అని ఇంకొందరు రకరకాల కథనాలు ప్రచురించారు. అయితే..ఆ కథనాలన్నిట్నీ కాదంటూ సింపుల్ గా నెక్స్ట్ మంత్ తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేయనున్నాడు రాజమౌళి.ఇంతకీ సినిమా ఎవరితో అనుకొంటున్నారా.. అక్కినేని అందగాడు అఖిల్ తో. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో “హలొ” సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న అఖిల్.. ఆ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడని, అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చోందని సమాచారం. ఇప్పటికే సినిమాకి చాలా గ్యాప్ రావడంతోపాటు.. తాను తెరకెక్కించాలనుకొంటున్న “మహాభారతం” స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యేసరికి ఎలాగూ ఆరేడు నెలలు పట్టే అవకాశం ఉంది, అందుకే ఈలోపు అఖిల్ తో సినిమా పూర్తి చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

రాజమౌలి సినిమా అంటేనే ముందుగానే భారీ అంచనాలుంటాయి..అఖిల్ విషయానికొస్తే ఇప్పటివరకు అఖిల్ ఖాతాలో హిట్ లేదు.మొదటి సినిమా ఫట్..ఇప్పుడు రాబోయే సినిమా  ఎలా ఉంటుందో చెప్పలేం..మరి రాజమౌలి అఖిల్ కి హిట్ ఇస్తారో..దాంతో అయినా అఖిల్ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి..

Comments

comments

Share this post

scroll to top