రాజమౌళి సినిమాలో నటించడం అంత ఈజీ కాదు..ఓ సారి ఈ ఆన్ లోకేషన్ వీడియో చూస్తే తెలుస్తది.

ఎస్.ఎస్. రాజమౌళి. ప్రస్తుత తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రాజమౌళి సినిమా షూటింగ్ అంటే సందడి సందడిగా ఉంటుంది. ఏ మిస్టేక్ లేకుండా పర్ఫెక్షన్ కోసం పడి తపిస్తారు  రాజమౌళి .అందుకే ఆయన సినిమాలకు ఆడియెన్స్ లో అంత క్రేజ్. రాజమౌళి సినిమాలు సూపర్ హిట్ కావడానికి అదే కారణం.రాజమౌళి సినిమా షూటింగ్ ఆన్ లొకేషన్ ఎలా ఉంటుందంటే ప్రతి సీన్  తెరకెక్కించే  ముందూ అందులో నటించే నటీనటులచే రిహార్సల్స్ చేయిస్తాడు జక్కన్న. యాక్షన్ సీన్స్ రాజమౌళి సినిమాలలో సూపర్బ్ గా ఉంటాయని మనకు తెలిసిందే. లవ్ సీన్స్ కి అంతే ప్రియారిటీ ఇస్తాడు రాజమౌళి. ఈగ సినిమాలో కొంచెం కొంచెం పాటలో నాని, సమంతాల మధ్య మనసు హత్తుకునేలా ప్రేమ గీతాన్ని తెరకెక్కించాడు. ఆ పాటకు యుట్యూబ్ లో ఇప్పటికీ మంచి హిట్స్ వస్తున్నాయి. అయితే ఈ పాట విజువల్ గా ఇంత బాగా రావడానికి రాజమౌళి అండ్ టీం.. ఎలా కష్టపడ్డారో ఈ క్రింది వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top