ఇక్కడ రాజమౌళి,అక్కడ ఆయన తండ్రి..రికార్డులు షేక్ చేశారు.!

తండ్రి కొడుకులు సినిమా ఇండస్ట్రీని ఊపేస్తున్నారు. కొడుకు బాహుబలి సినిమాను తీసి టాలీవుడ్,కోలీవుడ్, బాలీవుడ్ లను ఊపేస్తుంటే. తండ్రేమో  భజరంగీ భాయిజాన్ తో సినీ ఇండస్ట్రీలోనే గొప్ప చిత్రం అంటూ చప్పట్లు కొట్టిస్తున్నారు. కలెక్షన్ల పరంగా బాహుబలి ప్రభంజనం అందరికీ తెలిసిందే… గ్రాఫిక్స్, చారిత్రక నేపథ్యం, హేమాహేమీ నటుల సహాకారంతో ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫర్ ఫెక్షన్ తో తీసిన రాజమౌళి తన సినిమాను ది బెస్ట్ మూవీ ఇన్ తెలుగు సినీ ఇండస్ట్రీ అని అనిపించారు.

ఎంతైనా అనుభవం అనుభవమే కదా… కొడుకే ఇంతగా ప్రభంజనం సృష్టిస్తే .. మరి తండ్రి ఇంకెంతటి మహాప్రభంజనం సృష్టించాలి..అలాగే చేశారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇప్పుడు బాలీవుడ్ ను  షేక్ చేస్తూ ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టించి.. ఏం సినిమా తీసారు అంటూ సినీ దిగ్గజాల చేత సైతం సలామ్ కొట్టిస్తున్న చిత్రం సల్మాన్ భజరంగిభాయిజాన్.. ఈ సినిమా చూసిన అమీర్ ఖాన్ సైతం సూపర్ సినిమా, ముఖ్యంగా ఈ సినిమాకు స్టోరీని అందించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలన్నారు. మరి అంతటి గొప్ప స్టోరీని అందించింది ఎవరనుకున్నారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.

దాదాపు  ఏకకాలంలో విడుదలై కలెక్షన్ వర్షం కురిపిస్తోన్న రెండు చిత్రాల్లో ఒకటి కొడుకుది, మరోటి తండ్రిది కావడం తో రాజమౌళి కుటుంబ సభ్యులు  హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు సినిమాల విజయాన్ని గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రీ కొడుకులు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top