“రాజమౌళి” అభిమానులకు శుభవార్త..! జక్కన్న “బాహుబలి” తర్వాత ఏ సినిమాకు “సీక్వెల్” చేయనున్నారో తెలుసా…?

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది మన రాజమౌళి గారు తీసిన తెలుగు సినిమా “బాహుబలి”. రాజమౌళి గారు తీసిన బాహుబలికి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. ప్రభాస్, రానా లకు మంచి పేరు తెచ్చిపెట్టండి “బాహుబలి” సినిమా. దేవసేనగా “అనుష్క”, శివగామిగా “రమ్యకృష్ణ” ఆక్టింగ్ అయితే పీక్స్ అనే చెప్పాలి. ప్రపంచానికి తెలుగోడి పవర్ ఏంటో చూపించారు రాజమౌళి గారు.

అభిమానులైతే “బాహుబలి – 3 ” ఉంటే బాగుండు అనే అనుకుంటున్నారు. కానీ ఇటీవలే దీనిపై క్లారిటీ ఇచ్చారు “రాజమౌళి” గారు. బాహుబలి సినిమాలో చెప్పాలనుకుంది అంతా రెండు భాగాల్లో చూపించేశారంట. బాహుబలి -3 ఉండదు కానీ టీవీ సిరీస్ ఉంటుందని స్పష్టం చేసారు. ఇంతలో రాజమౌళి గారు “అల్లు అర్జున్” తో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నారన్న వార్తలు మీడియాలో హల్చల్ చేసాయి. కానీ దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. కానీ రాజమౌళి గారు ఇటీవలే ఇంటర్వ్యూలో ఫాన్స్ అందరికి పండగ లాంటి వార్త ఒకటి చెప్పారు.

“ఈగ” తో కూడా సినిమా తీసి హిట్ కొట్టగల సమర్ధుడు “రాజమౌళి” గారు. ఈగ సినిమాలో “సమంత” నటనకు అయితే ఆడియన్స్ అందరు ఫిదా అయిపోయారు. రాజమౌళి సినిమాలోని విలన్స్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సుదీప్ అందరి ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా “గ్రాఫిక్స్” ఈ సినిమాకు ఎంతో ప్లస్. ఈగ ఎమోషన్స్ ను క్యారీ చేసింది మన కీరవాణి గారి నేపధ్య సంగీతం. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్టే కొట్టేసింది. ఇంతకీ ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు చెపుతున్నాను అనే కదా మీ డౌట్..?

“రాజమౌళి” గారిని ఇటీవలే ఇంటర్వ్యూలో మీ సినిమాల్లో ఏ సినిమాకు సీక్వెల్ తీయాలి అనుకుంటున్నారు అని ఇంటర్వ్యూయర్ అడిగారు. దానికి సమాధానంగా “జక్కన్న”…”ఈగ సీక్వెల్ తీసే ప్లాన్ లో ఉన్నా” అని సమాధానం ఇచ్చారు. అయితే నాని, సమంత లను పెట్టె “ఈగ” తీస్తారా..? లేక కొత్తవాళ్ళని పెట్టి తీస్తారా..? అనేది డౌట్. సినీ పరిశ్రమలో అయితే “బాలీవుడ్ నటులను” పెట్టి రాజమౌళి “ఈగ – 2 ” తీయనున్నారని టాక్. మరికొందరైతే “టీవీ సిరీస్” లాగ “ఈగ – 2 ” తీయనున్నారని చెపుతున్నారు. మొత్తానికి ఈగ – 2 అయితే ఆడియన్స్ ముందుకి రానుంది. ఈగ తో మన జక్కన్న ఇంకెన్ని రికార్డులు బద్దలుకొట్టనున్నాడో వేచి చూడాలి!

Comments

comments

Share this post

scroll to top