బాహుబలి ది కంక్లూజన్ .. ప్రి రిలీజ్ ఫంక్షన్ లో కన్నీరు పెట్టిన రాజమౌళి.!

బాహుబలి ది కంక్లూజన్ లో రాజమౌళి చేత కన్నీళ్లు పెట్టించారు.. నాన్న కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయింది పక్కనే ఉన్న రాజమౌళి కూతురు.. రాజమౌళిని,వాళ్ల కూతుర్నే కాదు మనచేత కూడా కన్నీరు పెట్టించింది ఎవరో తెలుసా సంగీత దర్శకుడు కీరవాణి…

బాహుబలి ది కంక్లూజన్ ప్రి రిలీజ్ ఫంక్షన్ లో ఒక్కొక్క పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తూ…వాళ్లకి సంబందించిన ఒక్కో AV ప్రదర్శించారు.. ప్రోగ్రామ్ అంతా కూడా ఎంతో హూందాగా నడిచింది…మరి రాజమౌళిని కీరవాణి ఎందుకు ఏడిపించారో తెలుసా… ప్రోగ్రామ్ లోకీరవాణి మాట్లాడ్తున్నప్పుడు రాజమౌళి గురించి ఒక పాట పాడారూ.పాట పాడేప్పుడూ రాజమౌళి రా ..పరిగెత్తి రా అని పిలవండి..రాజమౌళి వెళ్తుంటే అందరూ లేచి నిల్చోవడం మనల్ని కూడా ఏదో తెలియని భావోద్వేగానికి గురిచేస్తుంది….

ఆ పాటలో ఒక్కొక్క పదం..చివర్న వచ్చే పెద్దన్నయ్య దీవెన రాజమౌళినే కాదు మనల్ని కదిలిస్తాయి..మనచేత కంటతడి పెట్టిస్తాయి…మన ప్రతిభ బైటివాళ్లు ఎంతో మంది గుర్తించిన కొన్ని సార్లు దగ్గరవాళ్లు దాన్ని ఒప్పుకోరు దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి ఈర్ష్యా ,అసూయ లాంటివి ఉండొచ్చు.. కానీ … ఎంతమంది ఎన్ని రకాలుగా పొగిడినా సొంతవాళ్ల దీవెనల్లో ఉండే కిక్కే వేరప్పా…అదే ఇక్కడ రాజమౌళిని కదిలించింది..కన్నీళ్లు తుడుచుకుంటూ స్టేజి దిగి వస్తున్న తండ్రిని చూసి రాజమౌళి కూతురు తట్టుకోలేకపోయింది.. నాన్నను హత్తుకుని ఏడ్చేసింది…ఆ సన్నివేశం అక్కడ అందర్ని కదిలించింది… ఒక డైరెక్టర్ కు ఇంతకన్నా ఏం కావాలి… ఇంతకీ కీరవాణిగారు పాడిన సాంగ్ ఏంటో మీరూ ఓ లుక్కేయండి…

Watch Video:

Comments

comments

Share this post

scroll to top