రాజమౌళిని విజయేంద్రప్రసాద్ కొట్టాడంట!

ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళిని  రైటర్ విజయేంద్ర ప్రసాద్  కొట్టాడంట! తెలుగు సినీ చరిత్రలోనే సంచలనం బాహుబలి. ఆ సినిమాను తీసింది రాజమౌళి, ఆ సినిమా కథ ను రాసింది విజయేంద్రప్రసాద్.. అటువంటి  డైరెక్టర్ ను  రైటర్ ఎందుకు కొట్టాడో తెలుసుకోవాలంటే… రాజమౌళి చిన్నతనంలోకి తొంగి చూడాల్సిందే. బాహుబలి సినిమా కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ మరెవరో కాదు  రాజమౌళి తండ్రే. విజయేంద్రప్రసాద్ ఇద్దరి సంతానంలో ఒకరు అమ్మాయి కాగ మరొకరు ఈ దర్శక ధీరుడు రాజమౌళియే

రాజమౌళి చిన్నప్పటి నుండి అమ్మా కూచి అంట….  అలాంటి రాజమౌళిని పిర్ర మీద ఒక్కటి పీకారంట విజయేంద్ర ప్రసాద్.అది ఎందుకో తెలుసా.. రాజమౌళి ఆడుకుంటూ ఆడుకుంటూ ..వరుసలో వెళుతున్న చీమలను చూస్తూ ఒక్కొక్క దాన్ని నలుపుతూ చంపేస్తున్నాడట, అది చూసిన విజయేంద్ర ప్రసాద్ ఒక్కటిచ్చాడట. దాంతో ఎడుపు లంకించుకున్నాడట మన చోటా జక్కన్న..

Rajanna Success Meet Pictures

Rajamouli And His Father

రాజమౌళి ఎడవడాన్ని చూసి ఎత్తుకొని సముదాయిస్తూ. ఎందుకు కొట్టానో తెలుసా అని అడిగారట రాజమౌళి డాడీ . తెలియదు అని సమాధానం ఇచ్చాడట రాజమౌళి. ఈసారి  ప్రసాద్ గారు  ఎందుకేడ్చావ్ అని అడిగారు, నొప్పి పుట్టింది అనే సమాధానం ఇచ్చాడు జక్కన్న.. అప్పుడు ప్రసాద్ గారు నువ్వు నలిపినప్పుడు కూడా చీమలు అలానే బాధపడుంటాయ్.. ఇతరులను అలా ఎప్పుడూ బాధపెట్టకూడదు. జీవహింస మహాపాపం అని చెప్పారంట రాజమౌళికి వాళ్ల డాడీ విజయేంద్రప్రసాద్.

ఇవి చిన్ననాటి గురుతులే కావొచ్చు  కానీ …  విజయేంద్ర ప్రసాద్ లోని గుణాలకు అద్దం పడుతోంది. కొడుకును పెంచే తీరును తెలుపుతోంది. ఇతరులను గౌరవించాలి బాధపెట్టకూడదనే లైన్ ఉంది చూశారు… అది చాలు సమాజం పట్ల ఉన్న ప్రేమను చెప్పడానికి.  ధాంక్యూ విజయేంద్ర ప్రసాద్ గారు. దర్శక రత్నను మాకందించారు, అలాగే కుమారులకు లోకాన్ని చూపే దృష్టి కోణాన్ని  వివరించారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top