“తమన్నా” సీన్స్ “బాహుబలి – 2 ” లో “రాజమౌళి” కావాలనే తీసేశారంట..! ఎందుకో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది మన రాజమౌళి గారు తీసిన తెలుగు సినిమా “బాహుబలి”. రాజమౌళి గారు తీసిన బాహుబలికి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. ప్రభాస్, రానా లకు మంచి పేరు తెచ్చిపెట్టండి “బాహుబలి” సినిమా. దేవసేనగా “అనుష్క”, శివగామిగా “రమ్యకృష్ణ” ఆక్టింగ్ అయితే పీక్స్ అనే చెప్పాలి. కానీ “అవంతిక”గా చేసిన “తమన్నా” పాత్రమాత్రం “బాహుబలి- 2 ” లో కేవలం ఒక ఫ్రేమ్ కి మాత్రమే పరిమితమయ్యింది. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్ల్స్ కూడా వచ్చాయి.

సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ఒక ఇంటర్వ్యూ లో “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అనే ప్రశ్నకు సమాధానం చెపుతూ ఇంకేం చెప్పిందో చూడండి!

“బాహుబలి మొదటి భాగంలో “అవంతిక” పాత్ర వేసిన నాకు “బాహుబలి -1 ” రిలీజ్ కి రెండు రోజులముందే “బాహుబలి -1 ” ఎక్కడ ఎండ్ అవుతుందో తెలిసింది. “కట్టప్ప” బాహుబలిని ఎందుకు చంపాడో కూడా అప్పుడే తెలిసింది.

బాహుబలి -2 మొదలైన అయిదు నిమిషాల్లోనే ఈ సస్పెన్స్ తెలిసిపోతుంది. క్లైమాక్స్ లో చాలా మటుకు సినిమా నా చుట్టూనే తిరుగుతుంది. బాహుబలి – 1 క్లైమాక్స్ లో పెద్దగా కనిపించని నేను, బాహుబలి -2 క్లైమాక్స్ లో మాత్రం మొత్తం నేనే కనిపిస్తా. ఒక రకంగా చెప్పాలంటే క్లైమాక్స్ సన్నివేశం చోటు చేసుకునేదే నావల్ల”

విచిత్రం ఏంటి అంటే…బాహుబలి – 2 లో కూడా “తమన్నా” వి చాలానే సన్నివేశాలు షూట్ చేసారు అంట. కానీ రాజమౌళి గారే ఆ సన్నివేశాలు తొలగించారు. vfx లెవెల్ కి అందని షాట్స్ ఉండటం వల్ల తమన్నవి సీన్స్ తీశారంట. ఎడిటింగ్ లో ఆ సీన్స్ ను అందంగా చూపించలేకపోవడం వల్ల సీన్స్ తీసేసారు. దీనిపై తమన్నా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది!

Comments

comments

Share this post

scroll to top