ఒరేయ్ టైమ్,ప్లేస్ నువ్వు డిసైడ్ చేయ్..చేసి నాకు వాట్సప్ లో లొకేషన్ సెండ్ చేయ్
అక్కడికి నా కొడుకుని,లక్కీని తీసుకుని వస్తా..అంటూ విలన్ కి ఛాలేంజ్ చేసి..
ఏయ్ పెద్దాయన ఇది నా వాట్సప్ నంబర్ నోట్ చేసుకో అని 80745 45422 నంబర్ ని తనికెళ్లభరణికి ,రాధిక చెప్పే సీన్ ఇటీవల రాజా ది గ్రేట్ సినిమాలోది… సినిమాలో ఆ సీన్ కి చప్పట్లు కొట్టిన వారు చాలామందే కానీ… ఒకే ఒక వ్యక్తి మాత్రం ఆ సీన్ మూలంగా కష్టాలు పడుతున్నాడు..సినిమా యూనిట్ నే తిడుతున్నాడు..ఇంతకీ అతని కష్టానికి కారణమేంటి అనుకుంటున్నారా..ఆ ఫోన్ నంబర్ అతడిది కావడమే..సినిమా చూసిన వాళ్లందరూ ఈ నంబర్ కి కాల్ చేసి రవితేజా నా అని మాట్లాడతున్నారట..అతని బాద అతని మాటల్లోనే..
‘‘నా పేరు లంకలపల్లి గోపి. మాది విశాఖ జిల్లా ఆనందపురం గ్రామం. వృత్తిరీత్యా వడ్రంగి అయిన నేను నిన్నమొన్నటి వరకూ ఎంతో ప్రశాంతంగా బతికేవాడిని. అయితే ‘రాజా ది గ్రేట్’ సినిమా రిలీజైన నాటినుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో విలన్‌ను ఉద్దేశించి హీరో తల్లి రాధిక… ‘‘ఇదిగో నా ఫోన్ నంబరు. టైం,ప్లేస్ డిసైడ్ చేసి లొకేషన్ సెండ్ చేయ్’ అని సవాల్ చేస్తుంది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన నంబరు 80745 45422 నాదే. అయితే అది నిజంగానే రవితేజ ఫోన్ నంబరు అనుకున్న అభిమానులు నాకు తెగ ఫోన్లు చేసేస్తున్నారు.
దీంతో పనులు మానుకుని మరీ ఆ నంబర్ రవితేజది కాదు, నాది అని చెప్పుకోవాల్సి వస్తోంది. ఒకటి, రెండు కాల్స్ అయితే ఫర్వాలేదు.. కానీ మరీ వేలల్లో వచ్చే కాల్స్‌కు సమాధానం చెప్పడం కష్టంగా ఉంది. ఈ బాధ తట్టుకోలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, నాకు అవసరమైనప్పుడే ఆన్ చేసుకుంటున్నా. అభిమానులకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే… దయచేసి ఈ నంబరుకు ఫోన్ చేయొద్దు…! అసలు నా అనుమతి లేకుండా నా ఫోన్ నంబర్‌ను వినియోగించుకున్నందుకు ‘రాజా ది గ్రేట్