ఆ రాజు గారి డైనింగ్ టేబుల్ పై చిన్న రైలు ఉండేదట….వంటకాలన్నీ అందులో రౌండ్స్ కొట్టేవట.!?

ఫోటోలో కనిపిస్తున్న ఈ రాజు పేరు జీవాజీ రావ్ స్కిండియా….  గ్వాలియర్ ను పరిపాలించిన రాజుల వంశానికి చెందిన వాడు. ఈయన పరిపాలన గురించి కాస్త పక్కకు పెడితే ఈయన డైనింగ్ టేబుల్ మాత్రం అప్పట్లో హల్ చల్ చేసిందట.. తాజాగా ఈరాజా వారి డైనింగ్ టేబుల్ గురించి మరోసారి చర్చ జరుగుతుంది. ఇంతకీ ఆ డైనింగ్ టేబుల్ ప్రత్యేకత ఏంటంటే…..  రాజా గారి డైనింగ్ టేబుల్ మీద ఓ చిన్నపాటి రైలు ఉండేదట…..నిజం ట్రైన్ మాదిరిగానే దానికి ఓ 7 బోగీలు కూడా ఉండేవట….   ఒక బోగీలో అన్నం, మరో బోగీలో కూర, మరో బోగీలో మద్యం, మరో బోగీలో  సిగరెట్స్…మరో బోగీలో పచ్చడి..ఇలా ఒక్కొక్క బోగీలో ఒక్కో రకం తినడానికి సంబంధించిన ఐటమ్స్ తో నిండి ఉండేవట ఆ బోగీలు.

The_Maharaja_of_Gwalior

రాజు గారి కోసం వచ్చిన ప్రత్యేక అతిథులకు ….ఇక్కడే భోజనం పెట్టించే వారట ఈ రాజావారు. అందరూ వచ్చి  కూర్చొని తమ సీటు పక్కనే ఉన్న బటన్ ను నొక్కగానే ట్రైన్ వచ్చిస్విచ్ నొక్కిన వారి దగ్గరికి వచ్చి ఆగుతుందట…సదరు వ్యక్తి తనకు కావాల్సిన ఐటమ్స్ వేసుకొవొచ్చు..ఇంతలో మరో వ్యక్తి స్విచ్ నొక్కగానే అక్కడికి బయలు దేరుతుంది ఈ ట్రైన్..ఇలా ఎవరికి కావాల్సిన ఐటమ్స్ ను వారికి చేరవేస్తూ డైనింగ్ టేబుల్  చుట్టూరా చక్కర్లు కొట్టేదంట…ఈ ట్రైన్.

సర్వెంట్స్ ఉన్నప్పటికీ ఈ ట్రైన్నే ఎందుకు వాడారు అంటే ఆన్సర్ కూడా ఉన్నాయి…ఈ రాజావారి డైనింగ్  టేబుల్ చాలా పెద్దది….ఒకేసారి 150 మంది దాకా కూర్చొని బోంచేయొచ్చు…. అంత మంది డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే సర్వ్ చేయడం కష్టం…మరియు హడావుడిలో సర్వ్ చేసే పదార్థాలు మీదపడడం, ప్రతి చిన్న దానికి సర్వెంట్స్ ను పిలవడం…ఈ బాధలన్నీ ఉండవని ఇలా తయారు చేయించాడట ఈరాజా గారు.

మంచి ఐడియా కదా…..మన హోటల్స్ ఈ ఐడియాను కాపీ కొడితే  మస్త్ వ్యాపారం సాగుతుంది. దీన్ని చూశాక  వాట్ యాన్ ఐడియా రాజా జీ అనొచ్చు కదా.!

631126761

Also Read:  రాజు గారి స్పెషల్ మరచెంబు. లండన్ వాళ్లకు షాక్ ఇచ్చింది.

Also Read: రాజు గారి కుక్కలు…. వాటి దర్పం.

Comments

comments

Share this post

scroll to top