“రాజ్ తరుణ్, హేభ పటేల్” జంటగా మరోసారి “అంధగాడు” తో హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)

Movie Title (చిత్రం): అంధగాడు  (Andhagadu)

Cast & Crew:

  • నటీనటులు: రాజ్‌తరుణ్‌, హెబ్బా పటేల్‌, రాజేంద్రప్రసాద్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, సత్య, రాజా రవీంద్ర, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
  • సంగీతం: శేఖర్‌ చంద్ర
  • నిర్మాత: రామబ్రహ్మం సుంకర (ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌)
  • దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్‌

Story:

గౌతమ్‌(రాజ్‌తరుణ్‌) శారదాదేవి అనే అంధ ఆశ్రమంలో తన స్నేహితులు రాజు, కిరణ్‌, దివ్యలతో కలిసి పెరుగుతుంటాడు. తనకి కళ్ళు రావాలని హాస్పిటల్స్ అన్ని తిరుగుతుంటాడు. ఆ ప్రాసెస్ లో అసిస్టెంట్‌ కమీషనర్‌ ధర్మ(షాయాజీ షిండే) కూతురు నేత్ర(హెబ్బా పటేల్‌) పరిచయం అవుతుంది. తను గుడ్డివాడినని తెలిస్తే నేత్ర తనను విడిచి పెట్టేస్తుందని భావించిన గౌతమ్‌, తన స్నేహితుడు(స్యత) సహాయంతో నేత్ర దగ్గర కళ్ళు ఉన్నవాడిలా నటిస్తుంటాడు. కానీ ఓ సందర్భంలో నేత్రకు నిజం తెలిసిపోతుంది. తనకు అబద్ధం చెప్పినందుకు గౌతమ్‌ను విడిచి పెట్టి వెళ్ళిపోతుంది.
నేత్ర కంటి వైద్యురాలు. అందుకే ఓ యాక్సిడెంట్‌ కేసులో వచ్చిన కళ్ళను గౌతమ్‌కు పెట్టేలా ఏర్పాటు చేస్తుంది. కంటిచూపు వచ్చిన గౌతమ్‌, నేత్రను చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. తనే నేత్ర అని చెప్పకుండా మూగ అమ్మాయిలా నటిస్తుంది నేత్ర. అయితే గౌతమ్‌కు కూడా నేత్ర నటిస్తుందనే అసలు నిజం తెలుస్తుంది. కానీ నేత్ర వల్లే తనకు కళ్ళు వచ్చాయని, నేత్ర కూడా తనను ప్రేమిస్తుందని తెలుసుకున్న గౌతమ్‌ ఆమెను ప్రేమిస్తాడు. ఇది ఇలా ఉండగా…గౌతమ్‌కు ఓ కారు నెంబర్‌ పదే పదే కలలో కనపడుతూ ఉంటుంది. అదే సమయంలో కులకర్ణి(రాజేంద్రప్రసాద్‌) కారణంగా పేరు మోసిన రౌడీ బాబ్జీ(రాజా రవీందర్‌) మనుషులను చంపి మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు. అసలు కులకర్ణి ఎవరు? కులకర్ణి బాజ్జీ మనుషులను ఎందుకు చంపాలనుకుంటాడు? అసలు గౌతమ్‌కు, బాజ్జీకి ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

Review:

ఇప్పటివరకు లవర్ బాయ్ లా కనిపించిన “రాజ్ తరుణ్” ఇప్పుడు ఆక్షన్ హీరో లా కన్పిస్తాడు. గుడ్డి పాత్రలో చక్కగా నటించాడు. హెబ్బా పటేల్‌ తన పాత్రకు న్యాయం చేసింది. రాజ్‌తరుణ్‌, హెబ్బా జంట మరోసారి స్క్రీన్‌పై ఆకట్టుకుంది. ఇక మెయిన్‌విలన్‌గా చేసిన రాజా రవీందర్‌, సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో పాత్రలో ఒదిగిపోయాడు. కులకర్ణి పాత్రలో రాజేంద్ర ప్రసాద్‌ నటన గురించి మనం కొత్తగా చెప్పనక్కర్లేదు. సత్య, ఫిష్‌ వెంకట్‌, జయప్రకాష్‌ రెడ్డి, సుదర్శన్‌ అందరూ తమ వంతుగా కామెడిని పండించే ప్రయత్నం చేశారు. శేఖర్‌ చంద్ర ట్యూన్స్‌లో రెండు పాటలు బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ చాలా బావుంది.

Plus Points:

నటీనటులు
ఛాయాగ్రహణం
బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌
ఫస్టాఫ్‌

Minus Points:

సాగదీసిన సెకండ్ హాఫ్

Final Verdict:

రొమాన్స్ తో కామెడీ కలిసి ఆక్షన్ తో ఎండ్ అయిన కమర్షియల్ ఎంటర్టైనర్ “అందగాడు”. చూస్తే ఓ సారి చూడొచ్చు!

AP2TG Rating: 2.5/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top