నిన్న‌టి మ్యాచ్ లో రైనా కొట్టిన సిక్స్..6 ఏళ్ల బాలుడిని గాయ‌ప‌ర్చింది.!

నిన్న ఇంగ్లాడ్ తో జ‌రిగిన ఫైన‌ల్ టీట్వంటీ మ్యాచ్ లో సురేష్ రైనా కొట్టిన సిక్స్ …. సరాస‌రి స్టాండ్స్ లోకి వెళ్లి మ్యాచ్ వీక్షిస్తున్న 6 ఏళ్ళ బాలుడి ఎడ‌మ తొడ‌కి త‌గిలింది. దీంతో ఆ బాలుడిని చిన్న స్వామీ స్టేడియంలో ఉన్న మెడిక‌ల్ సెంట‌ర్ కు తీసుకెళ్లారు. అత‌నిని ప‌రిశీలించిన డాక్ట‌ర్ చిన్న దెబ్బ త‌గిలింద‌ని ప్ర‌మాదమేమీ లేద‌ని చెప్పాడు.

ఈ సంద‌ర్భంగా ఆ పిల్లాడు..న‌న్ను త్వ‌ర‌గా పంపేయండి…మిగితా మ్యాచ్ చూడాలంటూ డాక్ట‌ర్ ను తొంద‌ర పెట్ట‌డం విశేషం. పిల్లాడి మాట‌ల‌కు డాక్ట‌ర్ తో పాటు అక్క‌డున్న స్టాఫ్ కూడా న‌వ్వి పిల్లాడిని పంపించేశారు. ఇండియా ఈ మ్యాచ్ ను గెల‌వ‌డంతో..ఆ పిల్లాడు అంద‌రికంటే ఎక్కువ ఆనందంతో కేక‌లు వేశాడు.ఈ మ్యాచ్ లో 5 సిక్సుల‌తో రైనా విశ్వ‌రూపం చూపాడు..63 ప‌రుగులు చేసి టీమ్ ఇండియా గెలుపులో ప్ర‌ధాన భూమిక పోషించాడు.

ఇలా హిట్ట‌ర్ల సిక్సులు ప్రేక్ష‌కుల‌ను గాయ‌ప‌ర్చ‌డం ఇది కొత్తేమీ కాదు.

  • గంగూలీ కొట్టిన సిక్స్ ను క్యాచ్ ప‌ట్ట‌డానికి ట్రై చేసిన ఓ వ్య‌క్తి త‌ల ప‌గిలింది.

  • వార్న‌ర్ కొట్టిన ఓ షాట్ …..మ్యాచ్ చూస్తున్న పిల్లాడి భుజానికి త‌గిలి అత‌ని భుజం విరిగింది.

  • ఇక గేల్ ఎంత మందిని గాయ‌ప‌రిచాడో లెక్కేలేదు.!

Comments

comments

Share this post

scroll to top