రైల్వే సిగ్నల్ మెన్ గా పనిచేసిన కొండముచ్చు…

కొన్ని సినిమాలలో జంతువులు చేసే పనులను చూసి హ గ్రాఫిక్స్ అని కొట్టిపారేస్తాం.. సర్కస్ లలో జంతువులు చేసే కొన్ని పనులను చూసి ఔరా అనుకుంటాం… ట్రైయినింగ్ భలే ఇచ్చారే అనుకుంటాం… ఇప్పుడు అచ్చం అలా ట్రైయినింగ్ ఇచ్చిన కొండముచ్చు గురించే చెప్పుకుందాం… కానీ ఇది అల్లాటప్పా కొండముచ్చు కాదు.. ఇది చేసిన పని అంత సులభమైంది కాదు… ఇంతకీ కొండముచ్చు ఏం చేసింది..దానికి ఏం ట్రెయినింగ్ ఇచ్చారు అనుకుంటున్నారా…

సిగ్నల్ మన్ గా పని చేసింది  ఈ తోడేలు… మీరు చదివింది నిజమే రైల్వే సిగ్నల్ మెన్ గా …ఒక సారి సిగ్నల్ సరిగా ఇవ్వకపోతే వేలాదిమంది ప్రాణాలు పోతాయి..మనుషులే ఒళ్లు దగ్గరపెట్టుకుని చేయాల్సిన పని ..ఒక తోడేలు ఎలా చేసింది అనుకుంటున్నారా.. చేయడమే కాదు అది పని చేసిన తొమ్మిదేళ్లపాటు సిగ్నల్స్ విషయంలో ఏ చిన్న పొరపాటు కూడా చేయలేదు… ఇంతకీ విషయం ఏంటంటే..

జేమ్స్‌ వైడ్‌ అనే వ్యక్తి  రైల్వే సిగ్నల్‌మెన్‌గా పనిచేసేవాడు. అతడికి ఒక రైలు నుంచి మరో రైలు పైకి దూకడం అలవాటు.అందుకే అందరూ అతన్ని జంపర్ అని పిలిచేవారు.. ఒకరోజు ఇలాగే జంప్ చేస్తుంటే ప్రమాధం జరిగి జంపర్ రెండు కాళ్లు పోయాయి.. కృత్రిమ కాళ్లతో తన విధులు నిర్వర్తించేవాడు..అప్పుడు అతనికి చాలా ఇబ్బందిగా ఉండేది..తన ఉద్యోగం పోతుందనే భయంతో ఏదో ఒకటి చేయాలనుకున్నాడు.. ఒకరోజు మార్కెట్లో బండి లాగుతున్న కొండముచ్చును చూసి దానికి ట్రెయినింగ్ ఇస్తే బాగుంటుందనుకున్నడు…అనుకున్నట్టుగానే ట్రెయినింగ్ ఇవ్వడం..ఆ కొండముచ్చు కూడా సిగ్నల్స్ వేయడం నేర్చుకంది.. జేమ్స్‌కు అది తోడుగా ఉంటూ సిగ్నల్స్‌ వేసేది. దీని గురించి రైల్వే ఉన్నతాధికారులకు తెలిసింది. వాళ్లు వచ్చి కొండముచ్చు చాలా చక్కగా సిగ్నల్స్‌ వేయడాన్ని గమనించి ,దాని పనితనం నచ్చి దానిని రైల్వే సిగ్నల్‌మెన్‌గా ఉద్యోగం ఇచ్చారు. 20 సెంట్ల జీతం, వారానికి ఒక సారి మద్యం ఇచ్చేవారు. జేమ్స్‌,  ఆ కొండముచ్చు ఇద్దరు స్నేహితుల్లా కలిసి తమ ఉద్యాగాలను నిర్వహించేవారు. .. ఇంతకీ ఆ కొండముచ్చు పేరు చెప్పలేదు కదూ… జాక్… ఇదంతా జరిగింది..1800 దక్షిణాఫ్రికాలో

Comments

comments

Share this post

scroll to top