అంధుల‌ను మోసం చేసిన రైల్వే అధికారులు… డెస్క్ జాబ్ కోసం ప‌రీక్ష రాస్తే అభ్య‌ర్థుల‌కు వ‌చ్చింది స్వీప‌ర్ ఉద్యోగాలు…

వారంతా కంటి చూపుకు నోచుకోని అంధులు. ఎన్నో క‌ష్టాలు ప‌డి, తీవ్రంగా శ్ర‌మించి, రాత్ర‌న‌కా, ప‌గ‌ల‌న‌కా చ‌దివి అత్యంత క‌ష్ట‌త‌ర‌మైన రైల్వే ఎగ్జామ్ రాశారు. వారు ప‌డిన శ్ర‌మ‌కు ఫ‌లితంగానే మంచి ర్యాంకులు వ‌చ్చాయి. ఇక నిశ్చింత‌గా ఒక చోట కూర్చుని ఉద్యోగం చేసుకోవ‌చ్చ‌ని ఎంతో సంతోష ప‌డ్డారు. అయితే వారి సంతోషం కొద్ది రోజులు కూడా మిగ‌ల‌లేదు. అంధులు కావ‌డంతో డెస్క్ జాబ్‌ల‌కు ప‌నికి రార‌ని రైల్వే అధికారులు వారికి స్వీప‌ర్ జాబ్‌ల‌ను క‌ట్ట‌బెట్టారు. వారు ప‌రీక్ష రాసింది డెస్క్ జాబ్ పోస్టింగ్‌కే అయినా, అధికారులు వారిపై వివ‌క్ష చూపుతూ అత్యంత అమానుషంగా, అమాన‌వీయంగా, నిర్దాక్షిణ్యంగా ఆ అంధుల‌కు స్వీప‌ర్లుగా పోస్టింగ్ ఇచ్చారు. అస‌లు వారు నిజంగా చేయ‌లేనిది స్వీపింగ్ ప‌నే. రోడ్ల‌పై చెత్త ఊడ్చ‌డం, దాన్నంతా ఎత్తి కుండీలో వేయ‌డం ఇదంతా చేయాలంటే వారి వ‌ల్ల అయ్యే ప‌ని కాదు. కానీ రైల్వే అధికారులు క‌న్నూమిన్నూ కాన‌కుండా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఇప్పుడు ఆ అంధులు ప‌డుతున్న బాధ వ‌ర్ణ‌నాతీతం.

blind-persons-sweeping-rail

అత‌ని పేరు షాదాబ్ ఆలం. వ‌య‌స్సు 23 సంవ‌త్స‌రాలు. ఢిల్లీ యూనివ‌ర్సిటీకి అనుబంధంగా ఉన్న స‌త్య‌వ‌తి కాలేజీలో గ్రాడ్యుయేట్ విద్య‌ను పూర్తి చేశాడు. అనంత‌రం ఇండియ‌న్ రైల్వేస్ గ్రూప్ డి ప‌రీక్ష‌లో ఉత్తీర్ణుడ‌య్యాడు. దీంతో అత‌ను రాసిన ప‌రీక్ష‌కు గాను అత‌నికి రైల్వేలో క్ల‌రిక‌ల్ పోస్ట్ రావాల్సి ఉంది. కానీ స్థానిక రైల్వే అధికారులు అత‌నికి స్వీప‌ర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. దీంతో అత‌ను న్యూఢిల్లీలోని ప్ర‌తాప్‌న‌గ‌ర్ రైల్వే కాల‌నీలో చెత్త ఊడ్చే ప‌ని చేస్తూ అవ‌స్థ‌లు ప‌డుతున్నాడు. అలాగే అశ్వ‌నీకుమార్ అనే మ‌రో వ్య‌క్తి కూడా ఢిల్లీ యూనివ‌ర్సిటీలో ఎంఏ హిస్ట‌రీ చ‌దివాడు. స్పెష‌ల్ బీఈడీ కూడా చేశాడు. రైల్వేలో వైర్‌లెస్ టెలి జాబ్ కోసం ప‌రీక్ష రాసి పాస‌య్యాడు. కానీ అత‌నికి వ‌చ్చింది మాత్రం స్వీప‌ర్ జాబ్‌. కేవ‌లం వీరిద్ద‌రే కాదు, అలా దాదాపు 50 మంది అంధుల‌కు రైల్వే అధికారులు స్వీప‌ర్ పోస్టుల‌ను ఇచ్చి సాగ‌నంపారు. వారంతా ఉత్త‌ర ఢిల్లీ రైల్వే డివిజ‌న్ ప‌రిధిలో ఉన్న వివిధ స్టేషన్ల వ‌ద్ద గ‌ల రైల్వే కాల‌నీలు, హాస్పిట‌ల్స్‌లో స్వీప‌ర్లుగా ప‌నిచేస్తున్నారు.

కాగా ప‌లువురు ఈ విష‌యాన్ని రైల్వే ఉన్న‌తాధికారుల వ‌ద్ద‌కు కూడా తీసుకెళ్లారు. దీంతోపాటు బాధిత వ్య‌క్తులు లేఖ‌ల ద్వారా త‌మ గోడును కూడా వారికి వెళ్ల‌బోసుకున్నారు. తాము డెస్క్ జాబులు మాత్ర‌మే చేయ‌గ‌ల‌మ‌ని, ఆ పోస్టుల‌కే ప‌రీక్ష రాశామ‌ని, స్వీప‌ర్ ఉద్యోగం చేయ‌లేమ‌ని బ‌తిమాలుతూ లేఖ‌లో పేర్కొన్నారు. అయినా రైల్వే ఉన్న‌తాధికారులు మాత్రం వారిని మ‌ళ్లీ చిన్న చూపే చూశారు. క‌నీసం మాన‌వ‌త్వం కూడా లేకుండా ప్ర‌వ‌ర్తించారు. ఏయే అభ్య‌ర్థుల‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వాలో స్థానిక రైల్వే డివిజ‌న్ బోర్డులే చూసుకుంటాయ‌ని రైల్వే ఉన్న‌తాధికారులు క‌ర్క‌శంగా స‌మాధాన‌మిచ్చారు. దీంతో ఆ అంధుల‌కు ఏం చేయాలో పాలుపోని స్థితి ఏర్ప‌డింది. ఉన్న‌త స్థాయి ఉద్యోగం వ‌స్తుంద‌ని ఆశించి రైల్వే ప‌రీక్ష రాసి పాసైతే ఇప్పుడు తాము స్వీప‌ర్లుగా అత్యంత క‌ఠిన‌త‌ర ప‌రిస్థితుల్లో ప‌నిచేయాల్సి వస్తోంద‌ని వారు వాపోతున్నారు. నిజంగా ఇలాంటి ప‌రిస్థితి ఏ విక‌లాంగుడికీ రాకూడ‌దు. ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్ వేదిక‌గా ఫిర్యాదులు, సూచ‌న‌ల‌కు స్పందించే కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్ర‌భుకు ఈ విష‌యం చేర‌వేస్తేనైనా బాధితుల‌కు స‌త్వ‌ర‌మే న్యాయం జ‌రిగేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ప‌లువురు నెటిజ‌న్లు భావిస్తున్నారు. సో, వారికి త‌గిలేలా మ‌న‌మూ ఈ స‌మాచారాన్ని అంద‌రికీ షేర్ చేద్దాం. అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న ఆ బాధిత అంధుల‌ను ఆదుకుందాం. ఏమంటారు!

ఏం చేయాలో తెలియ‌క స్వీప‌ర్లుగా విధులు నిర్వ‌హిస్తున్న అంధుల‌ను కింద వీడియోలో చూడ‌వ‌చ్చు…

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top