బండి బండి రైలు బండి,చైను లాగినా ఆగదండి?

అత్యవసర సమయంలో ఏ అద్దానైనా పగులగొట్టండి ఇది ప్రతి బస్స్ లో రాసుంటుంది. అలాగే అత్యవసర సమయంలో చైన్ లాగండి ఇది రైలు  పెట్టె లో దర్శనమిస్తుంది.కానీ ఇప్పుడు రెండో లైన్  డిలేట్ కానుంది. అసలు ఈ చైన్నే రైల్ల నుండి తొలగించే ప్రయత్నం జరుగుతుంది.  కొందరు ప్రయాణికులు తాము దిగాల్సిన ప్లేస్ లలో స్టాప్ లేకున్న చైన్ లాగి దిగేస్తుంటారు. ఏం జరిగిందో తెలుసుకుందాం అని భద్రతా సిబ్బంది వచ్చే వరకు చైను లాగిన సదరు వ్యక్తి  అక్కడి నుండి బిచాణా సర్దేస్తుంటారు.దీంతో సాఫీగా  ఎక్స్ ప్రెస్ రేంజ్ లో సాగాల్సిన  ట్రైను ప్రయాణం పల్లె వెలుగు లాగా ప్రతి స్టాప్ కు ఆగాల్సి వస్తుంది. దీని కారణంగా రైల్వే శాఖ కొత్త విధానానికి తెర లేపింది.

chail pulling

 

 

 రైల్వేడబ్బాలలో ఇక నుండి చైన్లలకు స్వస్తి చెప్పింది. ఇకపై ప్రయాణికులు అత్యవసర సమయాల్లోనే నేరుగా రైలు డ్రైవర్‌నే సంప్రదించవచ్చు. ఇందుకు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ ఇద్దరి నంబర్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతారు. దాంతోపాటు రైల్లోని ఇతర సిబ్బంది కూడా వాకీటాకీలతో అందుబాటులో ఉంటారు. అత్యవసరమైతే  ప్రయాణికులు వారిని  కూడా సంప్రదించవచ్చు.ఇక నుండి పట్టాల మీదకు చైన్లు లేని ట్రైన్లు బుల్లెట్ వేగంతో బ్రేకులు లేకుండా దూసుకెళ్లనున్నాయన్న మాట.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top