రైలులో బర్త్ పై పడుకొని ఉండగా…కొందరు పోకిరీలు ఆ హీరోయిన్ ని.! తోటి ప్రయాణికులు కూడా చూస్తూ.!

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘బంగారం’ చిత్రంలో మీరా చోప్రా చెల్లెలి పాత్రలో నటించిన సనూష పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తమిళనాడుకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. మలయాళ నటి అయిన సనూష బుధవారం రాత్రి రైలులో ప్రయాణం చేస్తుండగా, తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో వెంటనే అతనిని గుర్తించి పోలీసులకు అప్పగించింది సనూష.

గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘‘నేను బుధవారం రాత్రి ట్రయిన్‌లో ప్రయాణిస్తున్నాను. నా బెర్త్‌పై పడుకుని ఉండగా, ఒక వ్యక్తి నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటం గమనించాను. వెంటనే అతని చేయి పట్టుకుని లైట్స్ ఆన్ చేశాను. అయితే నాకు అతను అసభ్యకరంగా ప్రవర్తించిన దాని కంటే కూడా పక్కన మరో ఇద్దరు రియాక్ట్ అవకపోవడం చాలా బాధించింది. పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్లే వరకు నేను అక్కడే నిలబడి ఉన్నాను. ఇప్పుడు నేను చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుందని తెలుసు. ఈ విషయంలో నా కుటుంబం పూర్తి మద్దతునిచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా నేను మహిళలు మరియు అమ్మాయిలకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇటువంటి విషయాలు ఏవైనా జరిగితే వెంటనే రియాక్ట్ అవ్వండి. ఆలస్యం చేయవద్దు..’’ అని తెలిపింది.

బాలనటిగా సుమారు 40 చిత్రాలలో నటించిన సనూష, పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించింది.తెలుగులో ‘బంగారం’ చిత్రంలో బాలనటిగా నటించిన సనూష, ‘జీనియస్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

Comments

comments

Share this post

scroll to top