వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా ఉన్న పాపను రక్షించాడు, కానీ తను మాత్రం 2 చేతులు, ఒక కాలు కోల్పోయాడు.

రియాజ్ అహ్మద్ 9 యేళ్ళ కుర్రాడు…ఎండాకాలం సెలవులు కావడంతో అమ్మానాన్న లతో కలిసి అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లడానికి రెడీ అయ్యారు. నెలకు సరిపడ లగేజ్ సర్దుకొని రైల్వే స్టేషన్ కు వచ్చాడు. తాత చెప్పే కబుర్లను, అమ్మమ్మ ఇంటి దగ్గరుండే దోస్తులను గుర్తు తెచ్చుకుంటూ తెగ సంతోష పడుతున్నాడు. అంతలోనే అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.. ఉత్తరప్రదేశ్ నుండి ధర్యాబాద్ వెళ్ళాల్సిన ఎక్స్ ప్రెస్ ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫామ్ మీదకు మరికాసేపట్లో వచ్చును అంటూ అనౌన్స్ మెంట్ అదే పనిగా మోగుతోంది. రియాజ్ మరింత ఉత్సాహంతో ఉన్నాడు, అమ్మమ్మ వాళ్లింటికి వెళుతున్నానే ఆనందమే అతని మోఖం నిండా….
nt122pic1
ఆ సమయంలో  ఓ చిన్న పాప అదే స్టేషన్ లోని రైల్వే ట్రాక్ మీద కనిపించింది. అంతలోనే అదే ట్రాక్ మీద ఓ ట్రైన్ ఫాస్ట్ గా దూసుకొస్తుంది..హారన్ లు కొట్టుకుంటూ..అందరూ అయ్యో అయ్యో అంటున్నారు. హారన్ మోతతో ట్రైన్ దూసుకొస్తుంది. పాప అదే ట్రాక్ మీదుంది. వెంటనే స్పందించాడు 9 యేళ్ళ రియాజ్. ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఫ్లాట్ ఫాం పైకి దూకేసి ఆ పసిపాప ప్రాణాలను కాపాడాడు. కానీ దురదృష్ట వశాత్తు ఆ ప్రమాదం లో తన రెండు చేతులు మరియు కాళ్ళను పోగొట్టుకున్నాడు రియాజ్.
nt1
రియాజ్ అంత సాహసం ఎందుకు చేశావ్ ? అంటే…ఏమో చిన్నపాపను ఆ స్థితిలో చూడగానే కాపాడలనిపించింది అంటాడు. ఈ స్థితిలో కూడా రియాజ్ ఏంతో గుండెనిబ్బరంగా ఉన్నాడు, మంచిగా చదివి మంచి ఉద్యోగాన్ని తప్పకుండా సాధిస్తానని నమ్మకంతో చెబుతాడు ఈ  ఉత్తరప్రదేశ్ సాహసబాలుడు. అప్పుడు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు ,వాళ్లతో నేను అడుకునే వాడిని,ఇప్పుడు నేనే మునపటిలా ఆడలేను కదా అని అమాయకంగా అంటుంటే  చాలా బాధేస్తుంది.

Comments

comments

Share this post

scroll to top